Share News

తగ్గేదేలేదంటున్న హైడ్రా.. అక్రమ నిర్మాణాలపై కొరడా

ABN , Publish Date - Apr 11 , 2026 | 10:01 AM

సంగారెడ్డి జిల్లా పరిధిలోని ఐలాపూర్‌లో ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా హైడ్రా అధికారులు భారీ కూల్చివేతలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను తొలగించే ప్రక్రియలో భాగంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తగ్గేదేలేదంటున్న హైడ్రా.. అక్రమ నిర్మాణాలపై కొరడా
HYDRA

సంగారెడ్డి జిల్లా, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా పరిధిలోని ఐలాపూర్‌లో ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా హైడ్రా (HYDRA) అధికారులు భారీ కూల్చివేతలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను తొలగించే ప్రక్రియలో భాగంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


ఆ అపార్ట్‌మెంట్‌పై హైడ్రా చర్యలు..

ఐలాపూర్‌లో క్రిస్టల్ డెవలపర్స్ నిర్మించిన అపార్ట్‌మెంట్‌పై హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఈ అక్రమ నిర్మాణాలు చేపట్టారని అధికారులు నిర్ధారించారు. కూల్చివేతలకు ముందుగా అపార్ట్‌మెంట్‌లోని నివాసాలను, ఇతర వస్తువులను ఖాళీ చేయించిన అధికారులు, అనంతరం బుల్డోజర్లతో కూల్చివేత పనులు ప్రారంభించారు.


అడ్డుకున్న స్థానికులు..

హైడ్రా చేపట్టిన ఈ చర్యలను స్థానికులు, అపార్ట్‌మెంట్ కొనుగోలుదారులు తీవ్రంగా వ్యతిరేకించారు. తమకు న్యాయం చేయాలంటూ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో హైడ్రా సిబ్బందికి, స్థానికులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.


పోలీసుల మోహరింపు..

పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు ఐలాపూర్‌లో భారీగా పోలీసులను మోహరించారు. కూల్చివేతలను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ ప్రస్తుతం కూల్చివేతలు కొనసాగుతున్నాయి.

హైడ్రా హెచ్చరిక..

ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్, ప్రభుత్వ భూములను ఆక్రమించి కట్టిన ఏ నిర్మాణాన్ని అయినా వదిలే ప్రసక్తే లేదని అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

రౌడీషీటర్లపై సీపీ సజ్జనార్ కీలక చర్యలు

సీడబ్ల్యూసీలో పార్లమెంటు వ్యూహాలపై అగ్ర నేతల చర్చ

హైదరాబాద్‌లో ప్రేమ పేరుతో వల.. హిందూ అమ్మాయిలే టార్గెట్..

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Apr 11 , 2026 | 10:15 AM