సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
ABN , Publish Date - Aug 11 , 2026 | 09:01 PM
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామం సమీపంలో యూ టర్న్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కూలీలను తీసుకెళ్తున్న ఆటోను ట్యాంకర్ ఢీకొంది.
సంగారెడ్డి జిల్లా, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామం సమీపంలో యూటర్న్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కూలీలను తీసుకెళ్తున్న ఆటోను ట్యాంకర్ ఢీకొంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు దుర్మరణం చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కర్ణాటక రాష్ట్రం హుమనాబాద్ నుంచి జహీరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రతిరోజు కూలి పని కోసం జహీరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాలకు కూలీలు వస్తూ ఉంటారు. ఆటోలో మొత్తం 14 మంది ఉన్నట్లు సమాచారం. ఆయిల్ ట్యాంకర్ హైదరాబాద్ వైపు నుంచి కర్ణాటకకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాలోని రాజగిరికి చెందినవారిగా గుర్తించారు. సమాచారం అందగానే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
కోహీర్ మండలంలో మరో ఇద్దరి మృతి
సంగారెడ్డి జిల్లాలోని కోహీర్ మండలం వెంకటాపూర్ వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై మరో ప్రమాదం జరిగింది. డివైడర్ పై నుంచి కారు అవతల వైపు ఎగిరి పడటంతో ఎదురుగా వస్తున్న నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు దుర్మరణం చెందారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా రోడ్డు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి

సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.
వార్తలు కూడా చదవండి...
'హర్ ఘర్ తిరంగా' అభియాన్‌లో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలి: బండి సంజయ్
ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీబీసీఐడీకి బదిలీ చేయాలి: సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు
తెలంగాణలో 73.95 లక్షల ఓట్లు ఔట్?
Read Latest AP News And Telangana News And National News
And Telugu News