గదిలో ఇద్దరు మహిళలతో భర్త.. అది చూసిన భార్య ఏం చేసిందంటే..
ABN , Publish Date - Jun 07 , 2026 | 06:21 PM
మెదక్ జిల్లాలో ఆర్మీ ఉద్యోగి పొన్నం కుమార్ దారుణ హత్యకు గురయ్యారు. మెదక్ పట్టణంలోని మిలిటరీ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మెదక్ జిల్లా, జూన్7 (ఆంధ్రజ్యోతి): మెదక్ జిల్లాలో ఆర్మీ ఉద్యోగి పొన్నం కుమార్ దారుణ హత్యకు గురయ్యారు. మెదక్ పట్టణంలోని మిలిటరీ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగింది. ఈ ఘటనపై మెదక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్‌లో ఆర్మీ ఉద్యోగిగా పనిచేస్తున్న కుమార్ ప్రస్తుతం సెలవులపై స్వగ్రామానికి వచ్చారు. ఈ నెల 10వ తేదీన తిరిగి విధుల్లో చేరాల్సి ఉండగా అనూహ్యంగా హత్యకు గురయ్యారు.
కుమార్ ఇంట్లో ఇద్దరు మహిళలతో ఏకాంతంగా ఉన్న సమయంలో ఆయన భార్య పద్మ అక్కడికి చేరుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన భార్య పద్మ, పద్మ తల్లిదండ్రులు, పద్మ తమ్ముడు కలిసి కుమార్‌పై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం నిందితులు స్వయంగా మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, ఈ ఘటనకు సంబంధించిన ఇతర కోణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఫాంహౌస్ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధం: సీఎం రేవంత్‌రెడ్డి
ఆ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.. మంత్రి సీతక్క వార్నింగ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News