Share News

మహబూబ్‌నగర్ జిల్లా వైష్ణవి హత్య కేసు.. నిందితుడి మృతి

ABN , Publish Date - May 17 , 2026 | 08:29 AM

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో చోటుచేసుకున్న ఘటన విషాదాన్ని మిగిల్చింది. వైష్ణవి అనే యువతిని శనివారం రాత్రి గొంతుకోసి హత్య చేసిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

మహబూబ్‌నగర్ జిల్లా వైష్ణవి హత్య కేసు.. నిందితుడి మృతి
Mahabubnagar incident

మహబూబ్‌నగర్ జిల్లా, మే 17 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో చోటుచేసుకున్న ఘటన విషాదాన్ని మిగిల్చింది. వైష్ణవి(24) అనే యువతిని నిన్న(శనివారం) రాత్రి గొంతుకోసి హత్య చేసిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువతిని హత్య చేసిన అనంతరం అక్కడే ఉన్న ప్రజలు ఆగ్రహంతో నిందితుడిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వైష్ణవి హత్యకు గల కారణాలు ఏమిటి?, ఇద్దరి మధ్య పరిచయం ఏమైనా ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. యువతి హత్య, అనంతరం నిందితుడి మృతి స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు పరిస్థితిని అదుపులో ఉంచేందుకు చర్యలు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కాంగ్రెస్‌ను కేంద్రంలో అధికారంలోకి తేవడమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ రైజింగ్‌తో త్రీ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం: శ్రీధర్‌బాబు

ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్‌డేట్.. మంత్రి పొంగులేటి ప్రకటన

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 17 , 2026 | 08:31 AM