రెవెన్యూ డివిజన్‌గా కొడంగల్!
ABN , Publish Date - Mar 06 , 2026 | 12:19 PM
కొడంగల్ ప్రాంత సమగ్ర అభివృద్ధిలో భాగంగా డివిజన్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. డివిజన్ ఏర్పాటుతో వెనకబడిన కొడంగల్ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది.
ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు
మారనున్న పట్టణ రూపురేఖలు
నియోజకవర్గం ఒకే జిల్లాలో కొనసాగేలా చర్యలు
కొడంగల్ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
కొడంగల్(వికారాబాద్): కొడంగల్ ప్రాంత సమగ్ర అభివృద్ధిలో భాగంగా డివిజన్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. డివిజన్ ఏర్పాటుతో వెనకబడిన కొడంగల్(Kodangal) ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలు రెండు జిల్లాల్లో కొనసాగడంతో ఒకే జిల్లాలో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసేందుకు పరిశీలించాలని అధికారులకు సూచించినట్లు సమాచారం.
దీంతో కొడంగల్ ప్రాంతం డివిజన్ ఏర్పాటుతో రూపురేఖలు మారనున్నాయి. మొదటగా కొడంగల్‌ను జిల్లాగా ఏర్పాటు చేయాలని భావించినా డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కృతనిశ్ఛయంతో ఉన్నట్లు తెలుస్తుంది. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో వెనకబడిన కొడంగల్‌ను ప్రణాళికబద్ధంగా అభివృద్ధితో ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం ఫోకస్ పెట్టారు. డివిజన్ ఏర్పాటుపై ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు.
డివిజన్ ఏర్పాటుతో మరింత అభివృద్ధి
గత పాలకుల నిర్లక్ష్యంతో వెనకబడిన కొడంగల్ ప్రాంతం ప్రజాపాలనలో అభివృద్ధిలో దూసుకువెళ్తుంది. డివిజన్ కేంద్రం ఏర్పాటుకు నివేదికలు తయారు చేయాలని సీఎం అధికారులను ఆదేశించినట్లు తెలుస్తుంది. నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలతోపాటు పక్కనే ఉన్న కొన్ని మండలాలను కలిపి డివిజన్‌గా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గ కేంద్రం మీదుగా బీజాపూర్, చించోలి హైవేలున్నాయి.
దీంతోపాటు వికారాబాద్-కృష్ణా రైల్వేలైన్ కొడంగల్ మీదుగా మంజూరు కావడంతో సర్వే పనులు పూర్తయ్యాయి. దీంతో డివిజన్‌గా ఏర్పడితే కొడంగల్ మరింత అభివృద్ధి చెందుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అలాగే ఈప్రాంత వాసులకు రెవెన్యూ, ఇతరత్ర సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం సర్కిల్ కార్యాలయంగా కొనసాగుతున్న కొడంగల్ డీఎ్‌సపీ, ఆర్‌డీవో ఇతరాత్ర కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.
నియోజకవర్గం ఒకే జిల్లాలో ఉండేలా..
గత ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా కొడంగల్ నియోజకవర్గాన్ని విభజించి నాలుగు మండలాలు ఓ జిల్లాలో, మరో నాలుగు మండలాలు మరో జిల్లాలో కలిపారు. ప్రస్తుతం నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో కొడంగల్, బొంరా్‌సపేట్, దౌల్తాబాద్, దుద్యాల్ వికారాబాద్ జిల్లాలో కొనసాగగా, కోస్గి, మద్దూర్, కొత్తపల్లి, గుండుమాల్ మండలాలు నారాయణపేట జిల్లాలో కొనసాగుతున్నాయి. దీంతో పాలనపరంగా ఇబ్బందులు తప్పడం లేదు. సీఎం రేవంత్‌రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి ఒకే జిల్లాలో నియోజకవర్గం కొనసాగేలా ప్రణాళికలు రూపొందించాలని గతంలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలను చేర్చి డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి:
బేగంపేటలో బాంబు కలకలం.. అధికారులు అప్రమత్తం..
పెరుగుతున్న ‘మద్రాస్-ఐ’ కేసులు
Read Latest Telangana News and National News