బొత్స ఆరోగ్యంగా హౌస్‌కు రావడం సంతోషకరం: మంత్రి లోకేశ్
ABN , Publish Date - Mar 06 , 2026 | 11:12 AM
పూర్తి ఆరోగ్యంతో శాసనమండలికి వచ్చిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను మంత్రి లోకేశ్ ఆత్మీయంగా పలకరించారు. బొత్స ఆరోగ్యంగా హౌస్‌కు రావడం ఆనందంగా ఉందని మంత్రి అన్నారు.
అమరావతి, మార్చి 6: విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) ఈరోజు(శుక్రవారం) ఏపీ శాసనమండలికి వచ్చారు. ఆయనను మంత్రి లోకేశ్ ఆత్మీయంగా పలకరించారు. ‘బొత్స సత్యనారాయణ గారు నమస్కారం’ అంటూ పలకరించారు మంత్రి. బొత్స సత్యనారాయణ వినకపోవడంతో వెంటనే కల్పించుకున్న చైర్మన్.. ‘మంత్రి నారా లోకేశ్ మిమ్మల్ని పరామర్శిస్తున్నారు’ అంటూ బొత్సకు తెలియజేశారు. వెంటనే మంత్రి మాట్లాడుతూ..‘గురువుగారు చిన్న అనారోగ్య సమస్యతో బాధపడ్డారు. ఆయన తిరిగి ఆరోగ్యంగా హౌస్‌కు రావడం ఆనందంగా ఉంది’ అని మంత్రి లోకేశ్ అన్నారు.
ఇటీవల మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వెంటనే ఆయనను కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. చికిత్స అనంతరం మాజీ మంత్రి కోలుకున్నారు. సోషల్ మీడియాలో బొత్స ఆరోగ్యంపై వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన వెంటనే స్పందించారు. తన ఆరోగ్యంపై ఆందోళన అనవసరమని, తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు మాజీ మంత్రి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
పల్లెపండుగ రూపంలో గ్రామీణ రోడ్ల నిర్మాణం: మంత్రి నాదెండ్ల మనోహర్
‘మీకు రోజూ అలవాటుగా మారింది’.. వైసీపీ సభ్యులపై చైర్మన్ ఆగ్రహం
Read Latest AP News And Telugu News