‘మీకు రోజూ అలవాటుగా మారింది’.. వైసీపీ సభ్యులపై చైర్మన్ ఆగ్రహం
ABN , Publish Date - Mar 06 , 2026 | 10:42 AM
ఏపీ శాసనమండలిలో మరోసారి వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంతో పోడియం వద్ద ప్లకార్డులతో ఆ పార్టీ ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు.
అమరావతి, మార్చి 6: ఏపీ శాసనమండలి శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. సభ మొదలైన వెంటనే గీతం యూనివర్సిటీ 5 వేల కోట్ల భూ దోపిడీపై చర్చించాలని వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు(Chairman Koyye Moshen Raju) తిరస్కరించారు. దీంతో సభలో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్లకార్డులతో పోడియం వద్ద నినాదాలు చేశారు. వైసీపీ ఎమ్మెల్సీల(YCP MLCs) తీరుపై చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘మీకు రోజూ అలవాటుగా మారింది’ అంటూ ఫైర్ అయ్యారు. వాయిదా తీర్మానం ఆమోదం పొందదని తెలిసి ఎందుకు ఆందోళన చేస్తున్నారని చైర్మన్ ప్రశ్నించారు. వైసీపీ సభ్యుల ఆందోళనల మధ్యే చైర్మన్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. వైసీపీ ఎమ్మెల్సీ నిరసనతో సభలో గందరగోళం నెలకొనడంతో చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు.
ఇవి కూడా చదవండి..
గుంటూరులో డిస్నీ ల్యాండ్ ఏర్పాటుపై ఎమ్మెల్యే ప్రశ్న.. మంత్రి సమాధానం ఇదే
పల్లెపండుగ రూపంలో గ్రామీణ రోడ్ల నిర్మాణం: మంత్రి నాదెండ్ల మనోహర్
Read Latest AP News And Telugu News