Share News

అసోంలో కూలిన సుఖోయ్ యుద్ధ విమానం.. పైలట్ల మృతి

ABN , Publish Date - Mar 06 , 2026 | 11:14 AM

అసోంలో అదృశ్యమైన యుద్ధ విమానం కుప్పకూలిపోయిందని భారత వాయుసేన తాజాగా ప్రకటించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతిచెందారని తెలుపుతూ.. వారి పట్ల సంతాపం వ్యక్తం చేసింది.

అసోంలో కూలిన సుఖోయ్ యుద్ధ విమానం.. పైలట్ల మృతి
Sukhoi fighter jet crash in Assam

ఇంటర్నెట్ డెస్క్: వాయుసేనకు చెందిన సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం గురువారం రాత్రి గల్లంతైంది. అయితే.. ఆ ఫైటర్ జెట్ కూలిపోయిందని భారత వాయుసేన తాజాగా ప్రకటించింది. అసోం రాష్ట్రంలోని కార్బి ఆంగ్‌లోంగ్ జిల్లా సమీపంలో ఈ ఘటన జరిగిందని తెలిపింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతి చెందినట్టు పేర్కొంది.


శిక్షణలో ఉన్న రష్యాకు చెందిన సుఖోయ్-30 ఎంకేఐ ఫైటర్ జెట్.. అసోంలోని జోర్హాట్ వైమానిక స్థావరం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే రాడార్ నుంచి సంబంధాలు తెగిపోయినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కాసేపటికే ఇది ఓ మారుమూల కొండ ప్రాంతంలో అది కూలిపోయినట్టు సమాచారం. ఈ మేరకు ఆ ఏరియా భారీ పేలుడు శబ్దం వినిపించి, మంటలు చెలరేగినట్టు స్థానికులు తెలిపారు. అప్రమత్తమైన అధికారులు.. వెంటనే గాలింపు ముమ్మరం చేశారు. జోర్హాట్‌కు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో కూలిపోయినట్టు అధికారులు తాజాగా గుర్తించారు.


ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. మృతిచెందిన వారిని స్క్వాడ్రన్ లీడర్ అనుజ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేశ్ దుర్గాకర్‌గా తేల్చారు. వీరి మృతిపట్ల భారత వాయుసేన(ఐఏఎఫ్) సంతాపం తెలిపింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఎక్స్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.


ఇవీ చదవండి:

రికార్డు స్థాయిలో 17వ సారి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న సిద్ధరామయ్య

రాజ్యసభకు బిహార్‌ సీఎం నితీశ్‌ నామినేషన్‌

Updated Date - Mar 06 , 2026 | 11:24 AM