Share News

పెరుగుతున్న ‘మద్రాస్-ఐ’ కేసులు

ABN , Publish Date - Mar 06 , 2026 | 11:19 AM

రాష్ట్రవ్యాప్తగా ‘మద్రాస్-ఐ’ విస్తరిస్తోందని వైద్యశాఖాధికారులు పేర్కొన్నారు. వాతావరణంలో మార్పు కారణంగా, మద్రాస్-ఐ సాధారణ రేటుతో పోలిస్తే 20 శాతం పెరిగిందని వారు పేర్కొన్నారు.

పెరుగుతున్న ‘మద్రాస్-ఐ’ కేసులు

చెన్నై: రాష్ట్రవ్యాప్తగా ‘మద్రాస్-ఐ’ విస్తరిస్తోందని వైద్యశాఖాధికారులు పేర్కొన్నారు. వాతావరణంలో మార్పు కారణంగా, మద్రాస్-ఐ సాధారణ రేటుతో పోలిస్తే 20 శాతం పెరిగిందని వారు పేర్కొన్నారు. ఈ సమస్య ముఖ్యంగా పిల్లల్లో వున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మద్రాస్-ఐ అనేది కంటి, కనురెప్పను కలిపే శ్లేష్మ పొరలో సంభవించే వైరల్‌ ఇన్ఫెక్షన్‌. ఇటువంటి ఇన్ఫెక్షన్లు గాలి, కాలుష్యం ద్వారా వ్యాప్తి చెందుతాయి. అంతే కాదు, మద్రాస్-ఐతో బాధపడుతున్న వ్యక్తులు వారు ఉపయోగించే వస్తువులను ఉపయోగిస్తే, ఇన్ఫెక్షన్‌ ఇతరులకు వ్యాపిస్తుంది.


ఈ నేపథ్యంలో, మద్రాస్-ఐ బారిన పడిన వారి సంఖ్య ఇటీవల పెరుగుతున్నట్లు ప్రభుత్వాసుపత్రుల గణాంకాలు చెబుతున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వ వైద్యులు మాట్లాడుతూ.. ‘మద్రా్‌స-ఐ అనేది చాలా సాధారణమైన ఇన్ఫెక్షన్‌, దీనిని సులభంగా నయం చేయవచ్చు. అయితే, దీనిని ముందుగానే గుర్తించి తగిన చికిత్స చేయాలి. నిర్లక్ష్యం చేస్తే, అది దృష్టి మసకబారడానికి దారితీస్తుంది. కళ్లు ఎర్రబడటం, కంటిలో చికాకు, నిరంతరం నీరు కారడం, కనురెప్పలు అంటుకోవడం అనేవి మద్రాస్-ఐ ప్రధాన లక్షణాలు. సాధారణంగా, ఒక కంటిలో మద్రాస్-ఐ సమస్య ఏర్పడితే, మరొక కన్ను కూడా ప్రభావితమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.


nani1.2.jpgకాబట్టి, అలా ప్రభావితమైన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మద్రాస్-ఐ బారినపడిన వ్యక్తులు తమపాత కాంటాక్ట్‌ లెన్స్‌లను తొలగించి, వైద్యుడిని సంప్రదించిన తర్వాత కొత్తవాటిని ధరించాలి. వారు తమ వ్యక్తిగత వస్తువులను ఇతరులు ఉపయోగించడానికి అనుమతించకూడదు. కొన్నివారాలుగా రోజుకు కనీసం వందమంది ఈ ఇన్ఫెక్షన్‌ బారిన పడుతున్నారు. వారిలో చాలామంది పిల్లలు కావడం ఆందోళన కలిగించే విషయమం’ అని వైద్యులు హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మరోసారి తగ్గిన బంగారం, వెండి రేట్లు.. నేటి ధరలివే..

మీకు అంతా తెలుసుగా!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 06 , 2026 | 11:19 AM