సర్వీస్ ట్యాక్స్ వ్యవహారంలో రజనీకి ఊరట
ABN , Publish Date - Mar 06 , 2026 | 11:40 AM
స్థానిక కోడంబాక్కం హైరోడ్డులో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు చెందిన భవనానికి రూ.56.80లక్షల సర్వీస్ ట్యాక్స్ చెల్లించాలనే ఉత్తర్వులను ట్రిబ్యునల్ కోర్టు రద్దు చేసింది.
చెన్నై: స్థానిక కోడంబాక్కం హైరోడ్డులో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు చెందిన భవనానికి రూ.56.80లక్షల సర్వీస్ ట్యాక్స్ చెల్లించాలనే ఉత్తర్వులను ట్రిబ్యునల్ కోర్టు రద్దు చేసింది. కోడంబాక్కం ప్రాంతంలో హైటెక్ వసతులతో నిర్మించిన భవనాన్ని ఓ హోటల్ సంస్థకు రజనీకాంత్ అద్దెకు ఇచ్చారు. కాగా, ఈ భవనానికి 2007 నుండి 2012వ సంవత్సరం వరకు రూ.56లక్షల 84వేలు సర్వీస్ ట్యాక్స్ చెల్లించాలని ఆ శాఖ నోటీసులిచ్చింది. దీనిని వ్యతిరేకిస్తూ నందనంలోవున్న సర్వీస్ ట్యాక్స్ అపీలు ట్రిబ్యునల్‌లో 2016వ సంవత్సరం అపీలుకు వెళ్లారు.
ఈ అపీలుపై ట్రిబ్యునల్ సభ్యుడు ఎం.అజిత్‌కుమార్, న్యాయశాఖ సభ్యుడు అజయన్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. 1994 ఆర్ధిక చట్టం ప్రకారం హోటల్ నిర్వహణ కోసం అద్దెకిచ్చిన భవనాల నుండి సర్వీస్ ట్యాక్స్ వసూలు చేయడాన్ని మినహాయించినట్లు రజనీ తరుఫు న్యాయవాది రవిచంద్రన్ ధర్మాసనానికి వివరించారు. ఈ వాదనకు సర్వీస్ ట్యాక్స్ తరుఫున న్యాయవాది ఓఎం రీనా అభ్యంతరం తెలిపారు.
హోటల్‌లో డైనింగ్, మీటింగ్, క్లబ్, బార్ పనిచేస్తున్నాయని, వీటి ద్వారా ఆర్ధికంగా లబ్దిపొందుతున్న రజనీకాంత్ సర్వీస్ ట్యాక్స్ కట్టేలా ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. ఇరు తరుఫు వాదనలు విన్న ట్రిబ్యునల్ హోటళ్లలో బస చేసే అతిథుల సౌకర్యార్థం భోజనం, తదితర సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత వాటిని నిర్వహిస్తున్న యజమానులదేనని, దీనిని ఆదాయంగా భావించడం లేదన్న ట్రిబ్యునల్ రజనీకాంత్ సర్వీస్ ట్యాక్స్ చెల్లించాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను గురువారం రద్దు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మరోసారి తగ్గిన బంగారం, వెండి రేట్లు.. నేటి ధరలివే..
పెరుగుతున్న ‘మద్రాస్-ఐ’ కేసులు
Read Latest Telangana News and National News