డిండి ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేయాలి.. లేదంటే పోరాటం తప్పదు: డీకే అరుణ
ABN , Publish Date - Oct 16 , 2026 | 03:54 PM
పాలమూరు రైతుల నోట్లో మట్టికొట్టేలా డిండికి పాలమూరు లిఫ్ట్ నీటిని తరలించాలని చూస్తున్నారని ఎంపీ డీకే అరుణ వ్యాఖ్యానించారు. మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు మేలు చేయని సీఎం కూర్చీ రేవంత్ రెడ్డికి ఎందుకని ప్రశ్నించారు.
మహబూబ్నగర్, అక్టోబర్ 16: పాలమూరు రైతుల నోట్లో మట్టికొట్టేలా డిండికి పాలమూరు లిఫ్ట్ నీటిని తరలించాలని చూస్తున్నారని ఎంపీ డీకే అరుణ వ్యాఖ్యానించారు. ఈరోజు(శుక్రవారం) పాలమూరు- రంగారెడ్డి పెండింగ్ ప్రాజెక్ట్లపై భారతీయ జనతా పార్టీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు మేలు చేయని సీఎం కూర్చీ రేవంత్ రెడ్డికి ఎందుకని ప్రశ్నించారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిజైన్ మార్పు వల్ల మోసం జరుగుతుందని అన్నారు.
10 ఏళ్లు అధికారంలో ఉండి కేసీఆర్.. ఆర్డీఎస్కు చేసిందేమీ లేదని ఎంపీ విమర్శించారు. పాలమూరు జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రైతులపై, పెండింగ్ ప్రాజెక్టులపై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. డిండి ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేయాలని.. లేదంటే జిల్లాలో పెద్దఎత్తున బీజేపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని ఎంపీ డీకే అరుణ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్లో ఆపరేషన్ ‘కవచ్’.. పోలీసుల విస్తృత తనిఖీలు
ఓటర్ల తొలగింపుపై ప్రచారం అవాస్తవం: తెలంగాణ సీఈవో
Read Latest Telangana News And Telugu News