సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
ABN , Publish Date - Oct 16 , 2026 | 01:10 PM
గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఏపీ హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. విజయవాడకు చెందిన సాయికృష్ణ కస్టోడియల్ మృతి కేసుకు సంబంధించి పిటిషనర్‌కు రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించడంతో పాటు ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది.
అమరావతి, అక్టోబర్ 16: గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఏపీ హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. విజయవాడకు చెందిన సాయికృష్ణ కస్టోడియల్ మృతి కేసుకు సంబంధించి పిటిషనర్‌కు రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించడంతో పాటు ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది. బాధ్యులైన అధికారులను గుర్తించి చట్టప్రకారం ప్రాసిక్యూట్ చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తును సీబీఐలోని సీనియర్ అధికారికి అప్పగించాలని సీబీఐ డైరెక్టర్‌కు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. కేసుకు సంబంధించి పూర్తి రికార్డులను వారంలోగా ప్రత్యేక మెసెంజర్ ద్వారా సీబీఐ డైరెక్టర్‌కు అందజేయాలని ఏపీ డీజీపీని హైకోర్టు ఆదేశించింది.
అలాగే ఈ కేసులో పిటిషనర్‌కు పరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. నేటి నుంచి నాలుగు వారాల్లో పిటిషనర్‌కు రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పరిహారం మొత్తాన్ని పిటిషనర్ బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని పేర్కొంది. సాయికృష్ణ మృతికి కారణమైన బాధ్యులైన అధికారులపై సర్వీస్ నిబంధనల ప్రకారం శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపింది. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి వేసిన అనుబంధ పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం అనుమతించింది.
ఇవి కూడా చదవండి...
వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు
పిల్లలకు విద్యాబుద్ధులు ప్రసాదించాలని అమ్మవారిని వేడుకుంటున్నా: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telugu News