Share News

ఓటర్ల తొలగింపుపై ప్రచారం అవాస్తవం: తెలంగాణ సీఈవో

ABN , Publish Date - Oct 16 , 2026 | 02:13 PM

తెలంగాణలో భారీగా ఓట్లను తొలగించారంటూ జరుగుతున్న ప్రచారంపై సీఈవో సుదర్శన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఓటర్ల తొలగింపు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.

ఓటర్ల తొలగింపుపై ప్రచారం అవాస్తవం: తెలంగాణ సీఈవో
Telangana CEO Sudarshan Reddy

హైదరాబాద్, అక్టోబర్ 16: తెలంగాణలో భారీగా ఓట్లను తొలగించారంటూ జరుగుతున్న ప్రచారంపై సీఈవో సుదర్శన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఓటర్ల తొలగింపు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రవ్యాప్తంగా 73.39 లక్షల మంది ఓటర్ల ఫారాలు అందలేదని.. 2.64 కోట్ల మంది ఓటర్ల ఫారాలు స్వీకరించామని తెలిపారు. ఫారాలు అందిన ఓటర్ల పేర్లు ముసాయిదా జాబితాలో చేర్చినట్లు చెప్పారు. ఫారాలు అందని వారి పేర్లు ముసాయిదా జాబితాలో లేవన్నారు.


బీఎల్‌వో (BLO)లు ఇంటింటికీ వెళ్లి ఫారాలను సేకరించారని సీఈవో తెలిపారు. ఓటర్లకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఫారాల సమర్పణకు అవకాశమిచ్చామన్నారు. ఫారాలు అందని వారి కోసం క్లెయిమ్స్, అభ్యంతరాల ప్రక్రియ చేపట్టామన్నారు. అక్టోబర్ 15, 16 తేదీల్లో పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. కొత్త ఓటర్లు, యువ ఓటర్ల నమోదుకు ప్రత్యేక అవకాశం కల్పించినట్లు చెప్పారు. అర్హులైన ప్రతి ఓటరుకు జాబితాలో చోటు కల్పిస్తామని స్పష్టం చేశారు. 73.39 లక్షల మందికి అవకాశం ఇవ్వకుండా తొలగించారన్న ప్రచారం అవాస్తవమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

స్వీట్ షాపులపై టీజీ సేఫ్ దాడులు.. 2,480 కిలోల ఆహార పదార్థాల సీజ్

హైదరాబాద్‌లో ఆపరేషన్ ‘కవచ్’.. పోలీసుల విస్తృత తనిఖీలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 16 , 2026 | 02:53 PM