Share News

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్.. ఫోన్ నంబర్లు ఇవే

ABN , Publish Date - Oct 16 , 2026 | 01:59 PM

ఏపీ స్థానిక సంస్థల రెండవ సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేశారు. ఎన్నికల ఫిర్యాదుల స్వీకరణ కోసం విజయవాడలోని ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో ఈ కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుందని ఈసీ వెల్లడించింది.

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్.. ఫోన్ నంబర్లు ఇవే
AP Local Body Elections

అమరావతి, అక్టోబర్ 16: ఏపీ స్థానిక సంస్థల (పట్టణ, గ్రామీణ) రెండవ సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేశారు. ఎన్నికల ఫిర్యాదుల స్వీకరణ కోసం విజయవాడలోని ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో ఈ కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుందని ఈసీ వెల్లడించింది. ఫిర్యాదులు, సమస్యల కోసం (0866) 2490023, 2490024, 2490025, 2490026 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొంది.


అలాగే ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదులు పంపేందుకు secy.apsecl@gmail.com, secy.apsec2@gmail.com ఐడీలను సంప్రదించాలని ఈసీ తెలిపింది. అదనపు సమాచారం కోసం sec.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని ఎన్నికల సంఘం పేర్కొంది. కాగా.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు (ULB) అక్టోబర్ 28న పోలింగ్ జరుగనుండగా.. అక్టోబర్ 30న ఓట్ల లెక్కింపు జరగనుంది. అనంతరం నవంబర్ 3న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 5న ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనున్నారు. నవంబర్ 26, నవంబర్ 29, డిసెంబర్ 2 తేదీల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరిగిన రోజే ఫలితాలు కూడా వెల్లడికానున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది.


ఇవి కూడా చదవండి...

పిల్లలకు విద్యాబుద్ధులు ప్రసాదించాలని అమ్మవారిని వేడుకుంటున్నా: మంత్రి లోకేశ్

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 16 , 2026 | 02:15 PM