17న వరంగల్ నగరంలో ట్రాఫిక్ మళ్లింపు
ABN , Publish Date - Oct 16 , 2026 | 12:21 PM
ఈనెల 17న హనుమకొండ, వరంగల్, కాజీపేట ప్రాంతాల్లో హాప్ మార్థాన్ పరుగు ఉన్నందున ఉదయం 4 గంటల నుంచి 10 గంటల వరకు నగరంలోని ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత వెల్లడించారు.
వరంగల్: ఈనెల 17న హనుమకొండ, వరంగల్, కాజీపేట ప్రాంతాల్లో హాప్ మార్థాన్ పరుగు ఉన్నందున ఉదయం 4 గంటల నుంచి 10 గంటల వరకు నగరంలోని ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత వెల్లడించారు. నగర ప్రజలతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు గమనించి పోలీస్శాఖకు సహకరిం చాలన్నారు.
హైదరాబాద్ నుంచి హనుమకొండకు వచ్చే ప్రైవేట్ వాహనాలతో పాటు బస్సులు కాజీపేట ఫాతిమా జంక్షన్లోని మదర్ఽథెరిసా నుంచి వడ్డెపల్లి చర్చి, తులసీ బార్, కేయూసీ జంక్షన్, నయీంనగర్, సీపీఓ జంక్షన్ మీదుగా బస్టాండ్కు చేరుకోవాలి.
హనుమకొండ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు/ బస్సులు అశోక్ జంక్షన్ నుంచి పెద్దమగడ్డ, కేయూసీ, తిరుమల బార్, వడ్డెపల్లి చర్చి మీదుగా కాజీపేట నుంచి వెళ్లాలి.
హనుమకొండ కరీనంగర్కు వెళ్లే వాహనాలు అశోక్ జంక్షన్, ములుగు రోడ్డు, కేయూసీ మీదుగా వెళ్లాలి.
ఖమ్మం నుంచి హనుమకొండకు వచ్చే వాహనాలు/ బస్సులు సీఎస్ఆర్ గార్డెన్ నుంచి డైవర్షన్ తీసుకొని పోతనజంక్షన్ మీదుగా హనుమకొండకు వెళ్లాలి.
సీఆర్ఎస్ జంక్షన్ నుంచి అదాలత్ వైపు, అంబేద్కర్ జంక్షన్ నుంచి కాళోజీ జంక్షన్ వైపు, ఫాతిమా జంక్షన్ నుంచి ఎన్ఐటీ వైపు ఎలాంటి వాహనాలకు అనుమతిలేదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
సగం మంది వెన్నునొప్పి బాధితులే..!
Read Latest AP News And Telangana News And International News And Telugu News