Share News

ఏపీ స్థానిక ఎన్నికలు.. ఆ మూడు పార్టీలకు ఉమ్మడి గుర్తుల కేటాయింపు

ABN , Publish Date - Oct 16 , 2026 | 03:09 PM

ఏపీలో జరగనున్న రెండవ సాధారణ పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మూడు రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఉమ్మడి గుర్తులను కేటాయించింది.

ఏపీ స్థానిక ఎన్నికలు.. ఆ మూడు పార్టీలకు ఉమ్మడి గుర్తుల కేటాయింపు
APSEC Common Symbols

అమరావతి, అక్టోబర్ 16: ఏపీలో జరగనున్న రెండవ సాధారణ పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మూడు రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఉమ్మడి గుర్తులను కేటాయించింది. ‘జాతీయ సమ సమాజం పార్టీ’ అభ్యర్థులకు ఉమ్మడి గుర్తుగా ‘బ్యాట్’ (Bat) గుర్తును కేటాయించగా.. ‘భారత చైతన్య యువజన పార్టీ’కి ఉమ్మడి గుర్తుగా ‘బ్యాటరీ టార్చ్’ (Battery Torch) కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ‘రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్)’ పార్టీకి ‘గ్యాస్ సిలిండర్’ (Gas Cylinder) గుర్తును ఏపీ ఎస్ఈసీ (APSEC) కేటాయించింది.


ఉమ్మడి గుర్తులు పొందిన ఈ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం 10 శాతం స్థానాల్లో తమ అభ్యర్థులను పోటీకి దించాల్సి ఉంటుంది. ఉమ్మడి గుర్తు పొందేందుకు ఈ మూడు పార్టీలు ఏపీ ఎస్ఈసీకి చెరో రూ.1 లక్ష చొప్పున డిపాజిట్ చెల్లించాయి. 10 శాతం స్థానాల్లో పోటీ చేయకపోతే ఈ డిపాజిట్ మొత్తాన్ని ఎన్నికల సంఘం జప్తు చేస్తుంది. అక్టోబర్ 19, 2026న నోటిఫికేషన్ విడుదల కానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా ఈ పార్టీలకు ఇవే గుర్తులు వర్తించనున్నట్లు ఎస్‌ఈసీ పేర్కొంది. ఈ రిజిస్టర్డ్ పార్టీలకు ఉమ్మడి గుర్తుల కేటాయింపు అనేది కేవలం ఒక్కసారికి మాత్రమే వర్తించే సదుపాయమని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి...

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్.. ఫోన్ నంబర్లు ఇవే

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 16 , 2026 | 03:15 PM