Share News

అధికారంలో ఉన్నప్పుడు పేదవారిని పట్టించుకోని దొరల ప్రభుత్వం: మంత్రి పొంగులేటి

ABN , Publish Date - Nov 15 , 2026 | 08:05 PM

అధికారంలో ఉన్నప్పుడు పేదవారిని పట్టించుకోకుండా.. ప్రతి పక్షానికి వచ్చిన తర్వాత కొందరు మొసలి కన్నీరు కారుస్తూ.. ప్రజల ముందుకు వస్తున్నారని.. వారిని నమ్మకుండా కర్రు కాల్చి వాత పెట్టాల్సిన బాధ్యత ప్రజలదేనని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లాలోని ఏదులాపురంలో నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రతిపక్షాలను తీవ్రంగా విమర్శించారు.

అధికారంలో ఉన్నప్పుడు పేదవారిని పట్టించుకోని దొరల ప్రభుత్వం: మంత్రి పొంగులేటి
minister ponguleti in khammam

ఖమ్మం జిల్లా, నవంబర్ 15: జిల్లాలోని ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుపేటలో నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజాపాలనలో నాలుగున్నర లక్షల మందికి నూతన పెన్షన్లను అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు.


‘రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇస్తున్నాం. గత ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో రేషన్ కార్డులను ఇవ్వకపోతే.. ప్రజా ప్రభుత్వంలో ఇచ్చాం. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా సన్న బియ్యం ఇస్తున్నాం. డ్వాక్రా మహిళలకు 73 వేల కోట్ల రూపాయల రుణాలను సున్నా వడ్డీకి ఇచ్చాం.

పేదవారికి ఇళ్ళు ఇవ్వాలనే బుద్ధి గత పాలకులకు లేదు. మా ప్రభుత్వం ఎనిమిది లక్షల ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చింది. వారు కట్టిన కాళేశ్వరం కూలి పోయింది తప్ప.. దొరల పాలనలో పేదవారికి ఇళ్లు లభించలేదు. మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులు ఉన్న నియోజకవర్గంలో కూడా ఇందిరమ్మ ఇళ్ళను ఇస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేకపోయినా.. అభివృద్ధిని కుంటుపడనీయలేదు. వరి వేస్తే ఉరి అని ఆనాటి దొర చెబితే.. ఇందిరమ్మ ప్రభుత్వం.. వరికి 500 రూపాయల బోనస్‌తో పాటు మద్దతు ధరను కూడా ఇచ్చింది’ అంటూ మంత్రి ప్రజా పాలన గురించి తెలియజేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గిగ్ వర్కర్లకు ఆరోగ్య భద్రత కల్పిస్తామని రాహుల్ గాంధీ చెప్పడం పెద్ద జోక్: బండి సంజయ్

గిగ్ వర్కర్ల సంక్షేమ పథకం ప్రారంభించిన రాహుల్‌గాంధీ

దళిత సీఎం హామీ ఏమైంది.. కేటీఆర్‌కు కోమటిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 15 , 2026 | 08:05 PM