పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి: మంత్రి తుమ్మల
ABN , Publish Date - Apr 27 , 2026 | 10:14 AM
రైతన్నల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. అన్నదాతలు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లా, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): రైతన్నల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) వ్యాఖ్యానించారు. అన్నదాతలు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఈరోజు (సోమవారం) ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రఘునాథపాలెంలోని రైతువేదిక వద్ద రైతు ముగింట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడారు. రైతులను అన్నివిధాలుగా ఆదుకోవాలని శాస్త్రవేత్తలంతా కూడా గ్రామంలో ఉంటున్నారని తెలిపారు. రైతులకు యంత్రాలు అందజేయాలని తాము చూస్తున్నామని అన్నారు.
ఎప్పుడు ఏ విత్తనం వేయాలో.. ఏ కాలంలో ఏ విత్తనం వేస్తే మంచిదనే విషయాలను శాస్త్రవేత్తలు చెబుతారని తెలిపారు. పామాయిల్ కూడా పండించాలని.. రఘునాథపాలెం మండలం తెలంగాణలోనే నంబర్ వన్‌గా ఉండాలని ఆకాంక్షించారు. పామాయిల్ సాగుకు సబ్సిడీ, రైతుబంధు వస్తోందని స్పష్టం చేశారు. పామాయిల్ పంట వేస్తే అంతరపంటలు వేయ్యొచ్చని... రైతులు ఎక్కడ కష్టపడొద్దని చెప్పుకొచ్చారు. కేంద్రప్రభుత్వం పెట్రోల్ కొరత తీసుకువస్తోందని.. తెలియకుండా రేట్లు పెంచుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ప్రజావాణి సేవల విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
నటి అషురెడ్డి కుటుంబంపై నాన్ బెయిలబుల్ కేసు
Read Latest Telangana News And AP News And International News And Telugu News