Share News

గ్రానైట్ క్వారీ అనుమతికి రూ.13 లక్షల లంచం డిమాండ్.. సర్పంచ్ అరెస్ట్

ABN , Publish Date - Nov 18 , 2026 | 08:58 PM

గ్రానైట్ క్వారీల నిర్వహణకు అనుమతి కోరిన ఓ వ్యక్తి నుంచి సర్పంచ్ రూ. 2 లక్షల లంచాన్ని డిమాండ్ చేశాడు. ఇంకేముంది.. రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ.. సర్పంచ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని కోర్టులో హాజరుపరిచింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.

గ్రానైట్ క్వారీ అనుమతికి రూ.13 లక్షల లంచం డిమాండ్.. సర్పంచ్ అరెస్ట్
bribery sarpanch arrest

ఖమ్మం, నవంబర్ 18: గ్రానైట్ క్వారీల నిర్వహణకు అనుమతి కోరిన ఓ వ్యక్తి నుంచి సర్పంచ్ రూ. 13 లక్షల లంచాన్ని డిమాండ్ చేశాడు. ఇంకేముంది.. రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ.. సర్పంచ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని కోర్టులో హాజరుపరిచింది. వివరాల్లోకి వెళితే..


పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లాలోని సిరోలు మండలం, మదుగడ్డ తండా సర్పంచ్‌ ధరావత్ వీరును ఏసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రానైట్ క్వారీ నిర్వహణకు అనుమతి కోరిన ఓ వ్యక్తి నుంచి.. సర్పంచ్ రూ. 13 లక్షల లంచాన్ని డిమాండ్ చేశాడు. దీంతో ఆ వ్యక్తి వరంగల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.


ఏసీబీ అధికారులు చెప్పిన విధంగా.. సర్పంచ్‌‌తో లంచం ఇస్తానని సదరు వ్యక్తి ఒప్పుకున్నారు. ఇది నమ్మిన సర్పంచ్ తొలి విడతగా 2 లక్షల రూపాయలను ఖమ్మంలో ఇవ్వాల్సిందిగా తెలిపారు. దీంతో ఆ వ్యక్తి ఒప్పుకున్న విధంగా రెండు లక్షల రూపాయలను ఖమ్మంలో సర్పంచ్‌కు ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు సర్పంచ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని ప్రత్యేక కోర్టులో హాజరుపరచారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సమ్మక్క సాగర్‌ బ్యారేజీ.. ఎన్‌ఓసీ జారీకి ఛత్తీస్‌గఢ్ సీఎం సానుకూలం..!

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. అభివృద్ధిలో భాగస్వాములు కావాలి: మంత్రి శ్రీధర్‌బాబు

సుప్రీంకోర్టుకు చేరిన 'భారత్ సమ్మిట్' వివాదం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 08:58 PM