విభిన్న పంటలు.. నిరంతర ఆదాయం
ABN , Publish Date - Sep 18 , 2026 | 11:43 AM
ఉమ్మడి కరీంనగర్ జిల్లా తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లె గ్రామానికి చెందిన పలువురు రైతులు తక్కువ నీటి వినియోగంతో కూరగా యలు సాగు చేస్తూ ఆదాయం పొందుతున్నారు.
ఎల్‌నినో ప్రభావం అధిగమించేందుకు రైతుల ప్రయత్నం
పాంపాండ్‌తో భూగర్భ జలాల వృద్ధి
దేశాయిపల్లె గ్రామ రైతుల కూరగాయల సాగు
అభినందించిన జిల్లా కలెక్టర్
తంగళ్లపల్లి(కరీంనగర్): ఉమ్మడి కరీంనగర్ జిల్లా తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లె గ్రామానికి చెందిన పలువురు రైతులు తక్కువ నీటి వినియోగంతో కూరగా యలు సాగు చేస్తూ ఆదాయం పొందుతున్నారు. వ్యవ సాయ శాఖ సూచనలు, సల హాలు పాటిస్తూ అధునాతన పద్ధతులతో ఆరుతడి పంట లు, కూరగాయలు సాగు చేస్తూ ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమిస్తున్నారు.
ఆరుతడి పంటలపై దృష్టి
గ్రామానికి చెందిన కంకణాల రమేష్ మూడు సంవత్సరాలుగా బీరకాయలు, టమాట, మిర్చి, సొరకాయ, బంతి సాగు చేస్తున్నాడు. తన రెండెకరాల పొలంతో పాటు మరో 5 ఎకరాల భూమి కౌలుకు తీసుకుని కూర గాయలు సాగు చేస్తున్నాడు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. గ్రామంలో ఇప్పటికే కొంతమంది రైతులు కూరగాయల సాగు చేస్తుండడం అధికారులు భరోసా ఇవ్వడంతో ఆరుతడి పంటల సాగువైపు రైతులు దృష్టి సారించారు. ఒక ఎకరంలో బీరకాయ, సొరకాయ, టమాట, మిర్చి సాగు చేస్తే రూ. 80వేల ఆదాయం పొందవచ్చని రైతులు చెప్తున్నారు. గ్రామంలో కంకణాల రమేష్, కంకణాల రాజు, పారి పల్లి మహేందర్‌రెడ్డి, మల్యాల ఆశోక్ తదితరులు కూర గాయలు సాగు చేస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు.
సాగులో మల్చింగ్ షీట్ వినియోగం
కూరగాయల సాగులో మల్చింగ్ షీట్‌ను వినియోగిస్తూ కలుపు నివారణతో పాటు సాగునీటిని కూడా ఆదా చేసుకుంటున్నారు. ఈ షీట్ మొక్క చుట్టూ వేయడం వల్ల సాగునీరు ఆదా అవుతుంది. మొక్క చుట్టూ ఉంటే తేమ అవిరి కాకుండా ఉంటుంది. కలుపు నివారణ అవుతుంది. అలాగే వ్యవసాయ కూలీల ఖర్చు తగ్గుతుంది. డ్రిప్ సహాయంతో మొక్కలకు నీటిని అందిస్తున్నారు. దీంతో నీరు ఆదా అవుతుంది. మల్చింగ్ షీట్, డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటుకు ఉద్యానవన శాఖ రాయితీ అందిస్తోంది. పాంపాండ్‌లు ఏర్పాటు చేసుకున్నారు.
అధికారుల సూచనలు పాటించాలి: కంకణాల రమేష్, రైతు, దేశాయిపల్లె
వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖాధికారుల సూచనలు పాటించి పంటలు సాగు చేస్తే అధిక దిగుబడి పొందవచ్చు. గత మూడేళ్లుగా వారి సూచనలతో కూరగాయాల సాగు చేస్తూ అధిక దిగుబడితో అధిక ఆదాయం పొందుతున్నాను. ప్రస్తుతం ఎనిమిది ఎకరాలలో కూరగాయల సాగు చేస్తున్నాను. పాంపాండ్‌ను నిర్మించుకుంటే భూగర్భ జలాలు పెరిగి బోరుబావుల్లోకి నీరు చేరుతుంది, ఉద్యవన శాఖ అందించే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి.
కూరగాయల సాగుతో ఆదాయం: కంకణాల రాజు, రైతు , దేశాయిపల్లె
కూరగాయల సాగుతో ఎకరానికి రూ. 80వేల ఆదాయం వస్తుంది. ఎల్‌నినో ప్రభావంతో కూరగాయల సాగుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. అధికారుల సూచనలు పాటిస్తే పంట దిగుబడి పెరుగుతుంది. వరి పంట సాగు కంటే కూరగాయల సాగుతో ఆదాయం అధికంగా ఉంది. ఆరుతడి, కూరగాయల సాగు వైపు రైతులు మొగ్గు చూపాలి. పాంపాండ్ నిర్మించుకుని బోరుబావుల్లో నీటి వృద్ధి చేసుకోవాలి.
ఈ వార్తలు కూడా చదవండి:
పుష్పక్ బస్సుల్లో ఎయిర్‌పోర్టుకు తగ్గిన ప్రయాణికులు
Read Latest AP News And Telangana News And International News And Telugu News