పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎంతంటే..
ABN , Publish Date - Jun 03 , 2026 | 11:20 AM
గత కొద్దిరోజుల నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల 24, 22, 18 క్యారెట్ల బంగారంపై 10 రూపాయల చొప్పున పెరిగింది.
హైదరాబాద్, జూన్ 3: గత కొద్దిరోజుల నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల 24, 22, 18 క్యారెట్ల బంగారంపై 10 రూపాయల చొప్పున పెరిగింది. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఉదయం 11 గంటల సమయంలో హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,56,220 రూపాయల వద్ద.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,43,200 రూపాయల వద్ద.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,17,170 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
వెండి ధరలు ..
వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 100 గ్రాములపై 10 రూపాయలు.. కేజీ వెండిపై 100 రూపాయలు పెరిగింది. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఉదయం 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్ మార్కెట్‌లో 100 గ్రాముల వెండి 29,000 రూపాయల వద్ద.. కేజీ వెండి 2,90,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఇవి కూడా చదవండి
శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం