Share News

ఫార్ములా ఈ కేసు.. నాంపల్లి ఏసీబీ కోర్టుకు కేటీఆర్

ABN , Publish Date - Sep 18 , 2026 | 11:09 AM

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం కేటీఆర్ కోర్టుకు వచ్చారు.

ఫార్ములా ఈ కేసు.. నాంపల్లి ఏసీబీ కోర్టుకు కేటీఆర్
KTR

హైదరాబాద్, సెప్టెంబర్ 18: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం కేటీఆర్ కోర్టుకు వచ్చారు. ఈ కేసులో ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై మాజీ మంత్రి తన వాదనలను వినిపించనున్నారు. అలాగే కేసులో కేటీఆర్‌తో పాటు, ఏ2 ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3 హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు కూడా కోర్టుకు హాజరయ్యారు. కేటీఆర్ రాక సందర్భంగా కోర్టు వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు.


ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణకు సంబంధించి రూ.55 కోట్ల చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయని ఏసీబీ ఆరోపిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు చెల్లింపులు చేశారని చెబుతోంది. ఫార్ములా ఈ కేసుపై ఏసీబీ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్‌ను పలుమార్లు ప్రశ్నించింది. అయితే ఫార్ములా ఈ కేసును బోగస్ కేసుగా కేటీఆర్ అభివర్ణించారు. ఈ క్రమంలో ఈరోజు కోర్టు విచారణలో జరిగే పరిణామాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


ఇవి కూడా చదవండి..

ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు సహకరించండి.. కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్

అసెంబ్లీలో ఇందిరమ్మ ఇళ్లపై ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రస్తావన

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 18 , 2026 | 11:23 AM