Share News

అసెంబ్లీలో ఇందిరమ్మ ఇళ్లపై ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రస్తావన

ABN , Publish Date - Sep 18 , 2026 | 10:46 AM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎనిమిదో రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శాసనసభలో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇందిరమ్మ ఇళ్లపై ప్రస్తావించారు.

అసెంబ్లీలో ఇందిరమ్మ ఇళ్లపై ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రస్తావన
Telangana Assembly

హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎనిమిదో రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శాసనసభలో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇందిరమ్మ ఇళ్లపై ప్రస్తావించారు. ‘ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మా నియోజకవర్గానికి కేటాయించిన ఇళ్ల విషయంలో సమస్య ఉంది. మా నియోజకవర్గానికి ఇళ్లు కేటాయించారు. హైదరాబాద్ సిటీలో ఉన్న 15 నియోజకవర్గాల ఎమ్మెల్యేల సమస్య ఇది. ఇళ్లు డ్రా చేసే సమయంలో ఎమ్మెల్యేలందరికీ ఈ సమస్య ఎదురైంది. నా నియోజవకర్గంలో ఇతర నియోజకవర్గాల వారికి ఇళ్లు వచ్చాయి. మలక్‌పేటకు చెందిన వారికి ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఇళ్లు కేటాయించారు. ఇళ్ల కేటాయింపుల్లో నిబంధనలు పాటించలేదు. ఎమ్మెల్యేలకు మళ్లీ ప్రివిలేజ్ ఇచ్చి అవమానిస్తున్నారు. నేను ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసును ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు రిఫర్ చేయలేదు’ అని అన్నారు.


‘మా నియోజకవర్గానికి కేటాయించిన ఇళ్లను అర్హులైన వారికే ఇవ్వాలని కోరుతున్నాం. వాళ్లు ఇతర నియోజకవర్గాలకు చెందిన వారైనా వారి నియోజకవర్గంలోనే వారికి ఇళ్లు రావాలి. ప్రజాప్రతినిధులందరికీ సమాన గౌరవం ఉండాలి. అధికారులు ప్రజాప్రతినిధులను చూసి భయపడి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ప్రజాప్రతినిధికి తన ప్రజల కోసం పోరాడే హక్కు ఉంది. అదే సమయంలో మాకు కూడా మా నియోజకవర్గ ప్రజల కోసం పోరాడే హక్కు ఉంది. మా నియోజకవర్గానికి సంబంధించిన ఇళ్లపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలి. మొత్తం వ్యవహారంపై 360 డిగ్రీల స్క్రూటినీ జరిగిందని అధికారులు చెబుతున్నారు. 360 డిగ్రీల స్క్రూటినీ జరిగితే పొరపాటు ఎక్కడ జరిగింది. పొరపాటు జరిగితే అది అధికారుల తప్పే కదా. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి’ అంటూ దానం నాగేందర్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విషాదం.. సర్వీస్ రివాల్వర్‌తో రిజర్వ్ ఎస్సై ఆత్మహత్య..

ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు సహకరించండి.. కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 18 , 2026 | 10:56 AM