రైలుపైకి ఎక్కి హైటెన్షన్ వైర్‌ను పట్టుకునేందుకు యత్నం.. రేణిగుంటలో ఉత్కంఠ
ABN , Publish Date - Sep 18 , 2026 | 09:56 AM
తిరుపతిలోని రేణిగుంట రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. రైలుపైకి ఎక్కి హైటెన్షన్ విద్యుత్ వైర్‌ను పట్టుకునేందుకు యత్నించడం తీవ్ర కలకలం రేపింది.
తిరుపతి, సెప్టెంబర్ 18: తిరుపతిలోని రేణిగుంట రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. రైలు పైకి ఎక్కి హైటెన్షన్ విద్యుత్ వైర్‌ను పట్టుకునేందుకు యత్నించడం తీవ్ర కలకలం రేపింది. సదరు వ్యక్తి తిరువనంతపురం - న్యూఢిల్లీ కేరళ ఎక్స్‌ప్రెస్‌లో నుంచి దిగి.. ప్లాట్‌ఫాంపై కేకలు వేస్తూ రైలు పైకి ఎక్కాడు. అక్కడ హైటెన్షన్ విద్యుత్ వైర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించగా.. ప్రమాదాన్ని గమనించిన వెంటనే రైల్వే అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఆపై ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ, ఫైర్ సిబ్బంది గంటపాటు శ్రమించి అతడిని సురక్షితంగా కిందకు దించడంతో పెను ప్రమాదం తప్పింది.
అయితే విద్యుత్ సరఫరా నిలిపివేతతో కొద్దిసేపు రైళ్ల రవాణా నిలిచిపోయింది. ‘నన్ను అరెస్ట్ చేస్తే 48 గంటల్లో కోర్టులో హాజరుపరచాలి’, ‘త్రీ స్టార్ ఆఫీసర్ మాత్రమే రావాలి’ అంటూ నిందితుడు హల్‌చల్ చేశాడు. వ్యక్తికి మతిస్థిమితం లేదా లేక మద్యం మత్తులో ఉన్నాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనతో రేణిగుంట రైల్వే స్టేషన్‌లో కొద్దిసేపు ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
ఇవి కూడా చదవండి..
నా తప్పులు దాచేస్తా.. హద్దులు దాటేస్తా!
Read Latest AP News And Telugu News