Share News

చేదెక్కిన చక్కెర.. 15 రోజుల వ్యవధిలో భారీగా పెరిగిన ధరలు

ABN , Publish Date - Aug 21 , 2026 | 12:51 PM

చక్కెర ధరలు ఒక్కసారిగా పెరగడంతో సామాన్య ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

చేదెక్కిన చక్కెర.. 15 రోజుల వ్యవధిలో భారీగా పెరిగిన ధరలు
sugar price hike

  • కిలో రూ.46 నుంచి రూ.60కి పెంపు

  • సామాన్యుడిపై అదనపు భారం

జగిత్యాల: చక్కెర ధరలు ఒక్కసారిగా పెరగడంతో సామాన్య ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. 15 రోజుల వ్యవధిలో కిలోకు 14 రూపాయలు పెరగడంతో కుటుంబ బడ్జెట్‌పై అదనపు భారం పడుతోంది. నిత్యావసర సరుకుల్లో కీలకమైన చక్కెర ధర పెరగడం వల్ల మధ్యతరగతి, పేద కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. చక్కెర ధర పెంపుతో టీ, కాఫీతో పాటు స్వీట్లు, బేకరీ ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ధరల పెరుగుదలపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు దృష్టి సారించి మార్కెట్‌లో అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత లేకుండా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు. ధరలు మరింత పెరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.


మరింత పెరిగే అవకాశం

జిల్లాలో 15 రోజుల క్రితం కిలో చక్కెర ధర రూ.46 ఉండగా వారం క్రితం రూ.52కు చేరింది. ప్రస్తుతం కిలో చక్కెర ధర రూ.60 రూపాయలకు చేరింది. రాబోయే రోజుల్లో చక్కెర ధర రూ.65కు చేరే అవకా శం ఉందని పలువురు వ్యాపారులు పేర్కొంటున్నారు. చక్కెర ధర పెరగడంతో ఇళ్లలో రోజువారీ విని యోగంపై కూడా ప్రభావం పడుతోంది. చక్కెర ఖర్చు పెరగడంతో పేద, మధ్య తరగతి గృహిణులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పెరిగిన నిత్యావ సరాల ధరలకు తోడు మరో భారాన్ని మోయాల్సి వస్తోందని వాపోతున్నారు.


వ్యాపారుల ముందస్తు నిల్వలు...

చక్కెర ధరలు ఇంకా పెరుగుతాయనే అంచనాతో కొంత మంది వ్యాపారులు, పెద్ద వినియోగదారులు ఎక్కువగా నిల్వ చేసుకోవడం వల్ల మార్కెట్‌లో తక్షణ సరఫరా తగ్గుతోంది. దీనిని నియంత్రించేందుకు ప్రభుత్వం తాజాగా బల్క్‌ వినియోగదారులపై 15 రోజుల నిల్వ పరిమితి విధించాలని నిర్ణయించింది. మార్కెట్‌ లో చక్కెర అక్రమ నిల్వలపై ప్రభుత్వం దృష్టి సారిం చాలని పలువురు వినియోగదారులు కోరుతున్నారు.


sugar1.2.jpgపెరుగుదలకు కారణాలు..

దేశంలో చక్కెర ధరలు వేగంగా పెరగడంలో ఐదు ప్రధాన కారణాలు ఉన్నాయి. చెరుకు ఉత్పత్తిపై వాతావరణ ప్రభావం. చెరుకు పండించే ప్రధాన ప్రాంతాల్లో వర్షపాతం లోటు, రాబోయే సీజన్‌లో ఉత్పత్తి తగ్గవచ్చన్న అంచనాలు కూడా ధరలు పెంచుతున్నాయి. దేశీయ వినియోగంతో పోల్చితే అందుబాటులో ఉన్న నిల్వలు తగ్గుతున్నాయి. ఐసీఆర్‌ఏ అంచనా ప్రకారం సెప్టెంబరు నాటికి ముగింపు నిల్వలు సుమారు 4.3 మిలియన్‌ టన్నులకు తగ్గవచ్చని పేర్కొంది. ఇథనాల్‌ తయారీ పెరగడం వల్ల చక్కెరగా మార్కెట్‌లోకి వచ్చే పరిమాణం కొంత తగ్గుతోంది.


పండుగల సీజన్‌లో డిమాండ్‌ పెరడగం వల్ల కూడా చక్కెర నిల్వలు తగ్గుతున్నాయి. గణేష్‌ చతుర్ధి, దసరా, దీపావళి పండుగల ముందు స్వీట్లు, బేకరీ, పానీయాలు తదితర రంగాల్లో చక్కెర వినియోగం భారీగా పెరుగుతుంది. ఆగస్టు, నవంబరు మాసాల్లో ఈ అదనపు డిమాండ్‌ సరఫరాపై ఒత్తిడి పెంచుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఈసారి రోబో గణేశా!

క్యాన్సర్‌ కేర్‌, ఆరోగ్యశ్రీ భేష్‌!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 21 , 2026 | 12:51 PM