తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు
ABN , Publish Date - Aug 21 , 2026 | 10:35 AM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దైంది. ప్రస్తుతం సీఎం లండన్ పర్యటనలో ఉన్నారు. యూకే నుంచి అమెరికా వెళ్లాల్సిన ఆయన.. అక్కడకు వెళ్లకుండానే పర్యటనను రద్దు చేసుకుని తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్, ఆగస్టు 21: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దైంది. ప్రస్తుతం సీఎం లండన్ పర్యటనలో ఉన్నారు. యూకే నుంచి అమెరికా వెళ్లాల్సిన ఆయన.. అక్కడకు వెళ్లకుండానే పర్యటనను రద్దు చేసుకుని తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 19 నుంచి 30 వరకు పదిరోజుల పాటు విదేశాల్లో సీఎం పర్యటించాల్సి ఉంది. విదేశీ పర్యటనలో భాగంగా బ్రిటన్‌తో పాటు అమెరికాలో ఉన్న ప్రముఖ యూనివర్సిటీలను సందర్శించి విద్యా విధానం, స్కిల్ డెవలప్‌మెంట్ విషయంలో ఆయా దేశాలు ఎలాంటి విధానాలను అవలంభిస్తున్నాయనే దానిపై ముఖ్యమంత్రి అధ్యయనం చేయాల్సి ఉంది. పలు అంతర్జాతీయ యూనివర్సిటీలను సందర్శించే విధంగా షెడ్యూల్‌ను ఖరారు చేశారు.
ప్రస్తుతం లండన్‌లో ఉన్న సీఎం.. అక్కడ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, లండన్ బిజినెస్ స్కూల్‌ను సందర్శించాల్సి ఉంది. 23 వరకు లండన్‌లో పర్యటించనున్న సీఎం.. అక్కడి నుంచి అమెరికాలోని బోస్టన్‌కు వెళ్లాల్సి ఉంది. ఈనెల 29 వరకు అమెరికాలో పర్యటించి.. తిరిగి 30న హైదరాబాద్‌కు తిరిగి రావాల్సి ఉంది. అయితే, విదేశీ పర్యటనలకు వెళ్తున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం సీఎంవో అధికారులు దరఖాస్తు చేశారు. యూకే పర్యటనకు అనుమతి లభించినప్పటికీ, అమెరికా పర్యటనకు అనుమతి లభించకపోవడంతోనే సీఎం రేవంత్ పర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి...
ఎంపీ అవినాశ్ రెడ్డికి షాక్.. ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు..
అన్నవరం బస్టాండ్‌లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు..
Read Latest Telangana News And Telugu News