ప్రత్యేకావసరాల పిల్లలకు ‘ప్రశస్త్’ అండ
ABN , Publish Date - Aug 22 , 2026 | 11:19 AM
పాఠశాలలోని విద్యార్థుల అంగవైకల్యాన్ని ముందే గుర్తించేందుకు కేంద్ర విద్యాశాఖ రూపొందించిన ప్రశస్త్ యాప్ విద్యార్థులకు అండగా నిలువనుంది.
పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు డిజిటల్ స్క్రీనింగ్
ఇల్లంతకుంట(కరీంనగర్): పాఠశాలలోని విద్యార్థుల అంగవైకల్యాన్ని ముందే గుర్తించేందుకు కేంద్ర విద్యాశాఖ రూపొందించిన ప్రశస్త్ యాప్ విద్యార్థులకు అండగా నిలువనుంది. అంగవైకల్యం ఉన్న విద్యార్థులను గుర్తించి వారికి అవసరమైన విద్యావనరులు, ప్రభుత్వ సహాయం అందించేం దుకు ఎన్‌సీఈ ఆర్‌టీ రూపొందించినదే ప్రశస్త్ మొబైల్ యాప్. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు గురుకుల, కేజీబీ విద్యాలయాల్లో ప్రశస్త్ యాప్ ద్వారా 21రకాల వైకల్యాలను పరీక్షించేందకు ఈ యాప్‌ను ఉపయోగిస్తారు.
ప్రశస్త్ యాప్ విని యోగంపై జిల్లా విద్యాశాఖ అధికారులు ఇప్ప టికే ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ప్రతి ఉపాధ్యాయుడు ప్లే స్టోర్ నుంచి ప్రశస్త్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. పాఠశాల యూడైస్ నంబర్ ఎంటర్‌తో పాటు ఉపాధ్యాయుడి మొబైల్ నంబర్, క్యాప్చర్ ఎంటర్ చేయాలి. దీనితో ఉపాధ్యాయుడి మొబైల్ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్‌చేసి లాగిన్ కావలసి ఉంటుంది. అప్పుడు 10 వీడియోలు కనిపిస్తాయి. వీటిని ఒకదాని తర్వాత మరొకటి కచ్చితంగా చూడాలి. వీడియోలు చూసిన ఉపాధ్యాయుడు తరగతి గదిలో విద్యార్థులను గమనిస్తే ప్రత్యేక అవసరాలు ఉన్న వారిని గుర్తించడం సులభం అవుతుంది.
ఇలా గుర్తించిన విద్యార్థుల జాబితాను తయారుచేసుకోవడం ద్వారా తొలిదశ ప్రక్రియ పూర్తి అవుతుంది. ఉపాధ్యాయులు గుర్తించిన అంగవైకల్యం ఉన్న విద్యార్థులను రెండవ దశలో స్పెషల్ ఎడ్యుకేటర్ పునఃపరిశీలిస్తాడు. పరిశీలన అనంతరం ఏ విద్యార్థి ఎలాంటి వైకల్యంతో బాధపడుతున్నాడో పూర్తిస్థాయి నివేదిక సిద్ధం అవుతుంది. ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా 21రకాల వైకల్యాలను సులభంగా గుర్తించడానికి ప్రశస్త్ యాప్ దోహదపడుతుంది.
ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను పాఠశాల స్థాయిలోనే గుర్తించడం ద్వారా వారికి మెరుగైన వైద్యం అందించడానికి సిఫారసు చేయడమే కాకుండా వారు వైకల్య సర్టిఫికెట్ తీసుకోవడానికి సలుభం అవుతుందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. బహుళ ప్రయోజనాలున్న ప్రశస్త్ యాప్‌ను ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా వినియోగిం చాలని విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ అర్హుల జాబితా 25న..
Read Latest AP News And Telangana News And International News And Telugu News