Share News

ఆరోగ్య సిరి.. తృణ ధాన్యాలపై పెరుగుతున్న ఆసక్తి

ABN , Publish Date - Sep 17 , 2026 | 12:57 PM

ఉమ్మడి కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన ఒక సూపర్‌ మార్కెట్‌లో అన్ని నిత్యావసర సరుకులతో పాటు తృణ ధాన్యాలు అమ్మకానికి ఉన్నాయి. ఏడాది క్రితం వరకు మిల్లెట్ల అమ్మకాలు అంతంత మాత్రంగా ఉండేవి.

ఆరోగ్య సిరి.. తృణ ధాన్యాలపై పెరుగుతున్న ఆసక్తి
Millet Benefits

  • సంపూర్ణ ఆరోగ్యానికి ఆహారంలో మార్పులు

  • తిరిగివస్తున్న పాత వంటకాలు

చొప్పదండి(కరీంనగర్): ఉమ్మడి కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన ఒక సూపర్‌ మార్కెట్‌లో అన్ని నిత్యావసర సరుకులతో పాటు తృణ ధాన్యాలు అమ్మకానికి ఉన్నాయి. ఏడాది క్రితం వరకు మిల్లెట్ల అమ్మకాలు అంతంత మాత్రంగా ఉండేవి. ఆరు నెలల నుంచి తృణధాన్యాలు(మిల్లెట్ల) అమ్మకాలు పెరిగాయి. ప్రస్తుతం నెలకు రెండు నుంచి మూడు క్వింటాళ్ల మేరకు మిల్లెట్లు అమ్ముడు పోతున్నాయి. తెల్ల జొన్నలు, పచ్చ జొన్నలు, కొర్రలు, రాగులు, సజ్జలు, అరికలు, అండుకొర్రల వినియోగం బాగా పెరిగిం ది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోకి ఈ పాత వంటకాల కల్చర్‌ తిరిగి వచ్చింది.


పాత కల్చర్‌ తిరిగి వస్తోంది

దేశ స్వాతంత్య్రం రాక ముందు, వచ్చిన తర్వాత ప్రజలు వరికి బదులుగా జొన్నలు, రాగులు, కొర్రలు, సజ్జలు, వరిగెలు, గుమ్మడి గింజలను ఆహారంగా తీసుకునేవారు. వర్షాభావ పరిస్థితుల్లో కూడా ఇవి బాగా పండేవి. పండుగల సందర్భంగానే అనేక ఇళ్లలో అన్నం వండుకునే వారు. జొన్నరొట్టె వాడకం బాగా ఉండేది. జనాభా పెరుగుదలతో పాటు సేద్యం పెరగ డంతో వరి ఉత్పత్తి పెరిగింది. పాత రుచులైన రాగులు, సజ్జలు, జొన్నల వినియోగం తగ్గి వరి అన్నం వినియోగం బాగా పెరిగింది. ఫాస్ట్‌గా ఫాస్ట్‌ ఫుడ్‌ కల్చర్‌ రాగా ప్రస్తుతం పాత రుచులు అంతే ఫాస్ట్‌గా తిరిగి వచ్చేస్తున్నాయి. తృణ ధాన్యాల వినియోగం పెరిగి పోతోంది. రాగి సంకటి, జొన్నరొట్టె, సజ్జ రొట్టె, కొర్రలు, వరిగెలు, అండుకొర్రల వినియోగం బాగా పెరిగి పోయింది. ఆహార అలవాట్లు మారిపోతున్నాయి. రాత్రి పూట జొన్నరొట్టెలు, కొర్రలు లాంటి మిల్లెట్స్‌తో కూడిన టిఫిన్స్‌ను ఆహారంగా తీసుకుంటున్నారు.


వాడవాడనా జొన్నరొట్టె, రాగి జావ

నగరాలు, పట్టణాల్లో వాడవాడనా టీస్టాళ్ల మాదిరిగా రాగి జావ స్టాల్స్‌ వెలుస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో రాగి, జొన్న, బార్లీ జావ, గటుక, జొన్న రొట్టె స్టాల్స్‌ రోడ్డు పక్కన అమ్మకాలు కొన సాగుతున్నాయి. అనేక మంది వీటిని రోజువారి ఆహా రంలో భాగంగా చేసుకొని స్వీకరిస్తున్నారు. కనీసం ఒక పూట మిల్లెట్స్‌ ఆహారంగా తీసుకుంటున్నారు. మల్టీ మిల్లెట్ల రవ్వ సూపర్‌ మార్కెట్లలో అందు బాటులోకి రాగా ఉప్మాగా తీసుకుంటున్నారు. రాగులు, జొన్నలు, సజ్జలు, గోధుమలు, కొర్రలు, అరికెలు, సామలు, ఊదలతో కలిపిన మిల్లెట్‌ మిక్చర్‌ అందు బాటులోకి రాగా ప్రజలు విరివిగా వినియోగిస్తున్నారు. పట్టణాలే కాకుండా మండల కేంద్రాల్లో కూడా జొన్న రొట్టె, గట్క, జావా స్టాల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ప్రజలు కూడా ఉదయం రాగి జావ, బార్లీ జావ, గటుక, కొర్రల ఉప్మా, కొర్రల కిచిడి, సాయంత్రం జొన్న రొట్టె తింటున్నారు. ః


jmt1.jpgసంపూర్ణ ఆరోగ్యానికి తృణ ధాన్యాలు

సిరిధాన్యాలు(తృణ ధాన్యాలు) మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతున్నాయి. తృణ ధాన్యాలు వాడిన రోజుల్లో మనిషి కాయకష్టం చేసేవారు. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేవారు. మనిషి కూర్చున్న చోటు నుంచి లేవకుండా పనిచేసే వెసులుబాటు రాగా శారీరక శ్రమ తగ్గి అనారోగ్యాలు పుట్టుకొస్తున్నాయి. పాశ్చాత్య దేశాల అలవాట్లను ఆకళింపు చేసుకొని ఫాస్ట్‌ ఫుడ్‌ మోజులో పడి మన ప్రాచీన పద్ధతులను అటకెక్కించిన సందర్భం నుంచి తిరిగి వేగంగా జీవన విధానం మారుతోంది. తృణ ధాన్యాల వినియోగంపై ప్రజలకు అవగాహన పెరిగింది. రాగులు, జొన్నలు తిన్న రోజు మధు మేహం, బీపీలు ఉండేవి కావు. అదేవిధంగా చిరుధాన్యాల సాగును ప్రోత్సహిం చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2023- 24 సంవత్స రాన్ని ‘ఇయర్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌’గా ప్రకటించింది. మిల్లెట్‌ సాగుకు పలు ప్రోత్సాహాకాలను ప్రకటించి సాగును పెంచేందుకు కృషి చేస్తున్నది.


ఈ వార్తలు కూడా చదవండి:

నిజాం నిరంకుశత్వం తలవంచిన రోజు

మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 17 , 2026 | 12:57 PM