వాళ్లకు భయపడి చరిత్రను దాచిపెట్టారు.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై కిషన్ రెడ్డి ఫైర్
ABN , Publish Date - Sep 17 , 2026 | 11:49 AM
తెలంగాణలో రజాకార్లు మారణకాండ సృష్టించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రజాకార్ల దాష్టీకాన్ని గత పాలకులు తొక్కిపెట్టారని విమర్శించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 17: చరిత్రను ఎవరూ దాచిపెట్టలేరని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ.. తెలంగాణలో రజాకార్లు మారణకాండ సృష్టించారని తెలిపారు. రజాకార్ల దాష్టీకాన్ని గత పాలకులు తొక్కిపెట్టారని విమర్శించారు. చరిత్రను కాంగ్రెస్, బీఆర్‌ఎస్ దాచిపెట్టాలని చూశాయని ఆరోపించారు. మజ్లిస్‌కు భయపడి చరిత్రను దాచిపెట్టారని మండిపడ్డారు. అసెంబ్లీలో నిజాం పాలకులను సీఎం రేవంత్ రెడ్డి పొగిడారన్నారు. సీఎం రేవంత్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. నిజాం మంచివాడైతే ఉద్యమాలు ఎందుకు వచ్చాయని.. పోరాటాలు ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. నిజాం మంచివాడైతే ఆపరేషన్ పోలో ఎందుకు చేయాల్సి వచ్చిందని నిలదీశారు. రేవంత్ ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెబుతారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
నిజాం మంచోడని కొందరు పొగుడుతున్నారు: బండి సంజయ్
నిజాం మంచోడని కొందరు పొగుడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాం మంచోడైతే.. నాడు ఎందుకు పోరాటం చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. తెలంగాణ అమరవీరుల చరిత్రను దాచిపెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ చరిత్రను కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కనుమరుగు చేశాయంటూ బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇవి కూడా చదవండి..
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కీసర ఎస్‌ఐ.. ప్రెస్‌నోట్ విడుదల చేసిన ఏసీబీ
ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్
Read Latest Telangana News And Telugu News