కారులో పేలిన పవర్ బ్యాంక్.. ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం..
ABN , Publish Date - Sep 17 , 2026 | 10:53 AM
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రాంచంద్ర నాయక్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే కారులో మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రాంచంద్ర నాయక్ ఎలాంటి గాయాలు కాకుండా బయటపడగా.. ఆయన డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి.
మహబూబాబాద్: డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రాంచంద్ర నాయక్(MLA Jatoth Ramchander Naik)కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే కారులో మంటలు చెలరేగడం(Car Catches Fire)తో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రాంచంద్ర నాయక్ ఎలాంటి గాయాలు కాకుండా బయటపడగా.. ఆయన డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ (గురువారం) ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రజాపాలన ఉత్సవాల్లో పాల్గొని జెండా ఆవిష్కరించేందుకు మహబూబాబాద్ కలెక్టరేట్‌కు ఎమ్మెల్యే రాంచంద్ర నాయక్ బయలుదేరారు. అయితే, చింతపల్లి వద్దకు రాగానే ఆయన ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పవర్ బ్యాంక్ పేలడంతో కేబిన్‌లో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన ఎమ్మెల్యే, సిబ్బంది వెంటనే వాహనం నుంచి బయటకు దిగడంతో ప్రమాదం తప్పింది. అయితే, డ్రైవర్‌కు మాత్రం స్వల్ప గాయాలు అయ్యాయి.
అనంతరం రాంచంద్ర నాయక్ మరో వాహనంలో మహబూబాబాద్ కలెక్టరేట్‌కు బయలుదేరారు. ఎమ్మెల్యే కారులో మంటలు వ్యాపించాయన్న వార్త సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో ఆయన అభిమానులు, నియోజకవర్గ ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నారని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఆరుగురు విద్యార్థుల మృతి.. శిరీష మెమోరియల్ ట్రస్ట్ వార్డెన్ జయప్రకాశ్ అరెస్టు..
ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్