Share News

ఆరుగురు విద్యార్థుల మృతి.. శిరీష మెమోరియల్ ట్రస్ట్ వార్డెన్ జయప్రకాశ్‌ అరెస్టు..

ABN , Publish Date - Sep 17 , 2026 | 09:37 AM

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పెద్ద కంజర్లలో ఆరుగురు విద్యార్థులు మృతిచెందిన కేసులో శిరీష మెమోరియల్ ట్రస్ట్ వార్డెన్ జయప్రకాశ్‌ అరెస్టు అయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పటాన్‌చెరు పోలీసులు.. అతనిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

ఆరుగురు విద్యార్థుల మృతి.. శిరీష మెమోరియల్ ట్రస్ట్ వార్డెన్ జయప్రకాశ్‌ అరెస్టు..
Patancheru Tragedy

సంగారెడ్డి జిల్లా: పటాన్‌చెరు మండలం పెద్ద కంజర్లలో ఆరుగురు విద్యార్థులు మృతిచెందిన సంగతి తెలిసిందే. బుధవారం నాడు వినాయక నిమజ్జనానికి వెళ్లిన ఆరుగురు విద్యార్థులు నేరేడు చెరువులో పడి ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పటాన్‌చెరు పోలీసులు.. శిరీష మెమోరియల్ ట్రస్ట్ వార్డెన్ జయప్రకాశ్‌ను అరెస్టు చేశారు. అనంతరం అతనిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


మరోవైపు, పటాన్‌చెరు ఏరియా ఆస్పత్రిలో మృతిచెందిన విద్యార్థుల పోస్టుమార్టం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆస్పత్రి వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆస్పత్రి వద్దకు బాధిత కుటుంబాలు చేరుకుని ఆందోళనకు దిగాయి. భోరున విలపిస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. న్యాయం జరిగే వరకు మృతదేహాలను తీసుకోబోమని కుటుంబ సభ్యులు, బంధువులు భీష్మించుకుని కూర్చున్నారు. ఈ క్రమంలో వారికి నచ్చజెప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కాగా, ఇప్పటివరకు ముగ్గురు విద్యార్థుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తవగా.. మిగతా మృతదేహాలకు కొనసాగుతోంది.


మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కో విద్యార్థి కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. ఆరుగురిలో నాలుగు కుటుంబాలకు కలెక్టర్ చెక్కులు అందజేయగా.. మిగిలిన రెండు కుటుంబాలు వాటిని తీసుకునేందుకు నిరాకరించాయి. తమకు న్యాయం చేయాలని ప్రతీక్ జైన్‪ను వారు కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కీసర ఎస్‌ఐ.. ప్రెస్‌నోట్ విడుదల చేసిన ఏసీబీ

నాకు రూ.3 కోట్లు ఇప్పించండి

Updated Date - Sep 17 , 2026 | 09:40 AM