Share News

నాకు రూ.3 కోట్లు ఇప్పించండి

ABN , Publish Date - Sep 17 , 2026 | 06:42 AM

ఐ బొమ్మ, బప్పం టీవీ పేరుతో పైరసీ సామ్రాజ్యం నడిపి అరెస్ట్‌ అయిన ఇమ్మడి రవి వ్యవహారంలో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, తన రూ.3 కోట్లను తిరిగి ఇప్పించాలని కోరుతూ అతడు నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు

నాకు రూ.3 కోట్లు ఇప్పించండి
I Bomma Ravi

తీవ్ర ఆర్థిక ఇబ్బందులున్నాయ్‌

కోర్టును ఆశ్రయించిన ‘పైరసీ కింగ్‌’ ఐ బొమ్మ రవి

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): ఐ బొమ్మ, బప్పం టీవీ పేరుతో పైరసీ సామ్రాజ్యం నడిపి అరెస్ట్‌ అయిన ఇమ్మడి రవి వ్యవహారంలో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, తన రూ.3 కోట్లను తిరిగి ఇప్పించాలని కోరుతూ అతడు నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. సినిమా పైరసీకి పాల్పడుతూ పరిశ్రమకు రూ. వేలకోట్ల నష్టాన్ని కలిగించడమే కాకుండా, బెట్టింగ్‌ యాప్‌లను ప్రచారం చేసి రూ. కోట్లు సంపాదించాడన్న ఆరోపణలపై.. ఇమ్మడి రవిని సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గతేడాది నవంబర్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో అతడికి బెయిల్‌ లభించింది. అయితే, అరెస్టు సమయంలో పోలీసులు తన ఖాతాల్లో ఫ్రీజ్‌ చేసిన రూ.3 కోట్లు తిరిగి అన్‌ఫ్రీజ్‌ చేయించాలని కోరుతూ నాంపల్లి 9వ అదనపు చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్ కోర్టులో ఇమ్మడి రవి పిటిషన్‌ దాఖలు చేశాడు. తాను ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నానని, కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా ఉందని తెలిపాడు.

Updated Date - Sep 17 , 2026 | 06:42 AM