Share News

ఇద్దరి ఆస్తులపై విచారణ జరపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్‌ ఛాలెంజ్

ABN , Publish Date - Sep 17 , 2026 | 12:06 PM

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం పదవికి రేవంత్ కళంకం తెస్తున్నారని.. అన్ని రంగాల్లో రేవంత్ ప్రభుత్వం అట్టర్‌ఫ్లాప్ అంటూ వ్యాఖ్యానించారు.

ఇద్దరి ఆస్తులపై విచారణ జరపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్‌ ఛాలెంజ్
Former Minister KTR

హైదరాబాద్, సెప్టెంబర్ 17: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈరోజు(గురువారం) మీడియాతో మాట్లాడుతూ.. సీఎం పదవికి రేవంత్ కళంకం తెస్తున్నారని.. అన్ని రంగాల్లో రేవంత్ ప్రభుత్వం అట్టర్‌ఫ్లాప్ అంటూ వ్యాఖ్యానించారు. ఇది సర్వభ్రష్ట ప్రభుత్వమంటూ దుయ్యబట్టారు. శిఖర సమానమైన కేసీఆర్‌పై రేవంత్ నోరుపారేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటి వరకు కేసీఆర్‌కు వెయ్యి ఎకరాలు ఉన్నాయన్నారని.. ఇప్పుడేమో కేసీఆర్‌కు 67 ఎకరాలు ఉన్నాయంటున్నారన్నారు. కేసీఆర్‌కు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్ద పదవిలోకి మారినా.. రేవంత్ బుద్ధి మారడం లేదంటూ విమర్శలు గుప్పించారు.


‘కేసీఆర్ పుట్టినప్పుడు ఇల్లు రెండెకరాల్లో ఉండేది..మా తాతకు వందల ఎకరాల భూమి ఉండేది. ఇప్పుడు 67 ఎకరాల భూమి ఉండటం తప్పా?.. నేను యూఎస్‌లో ఉద్యోగం చేసి సంపాదించుకున్నా. రేవంత్ డిగ్రీ ఏడేళ్లు చదివినట్టు సర్టిఫికెట్స్ చెప్తున్నాయి.. గోడల మీద రాతలు రాసే నీకు జూబ్లీహిల్స్‌లో ఇల్లు ఎక్కడిది? మీ తమ్ముళ్లు ఏరో స్పేస్ కంపెనీలు ఎలా పెట్టారు? మా కులం వాళ్లందరి ఆస్తులు కేసీఆర్ ఖాతాలో వేస్తే ఎలా? కేసీఆర్ ఆస్తులు.. రేవంత్‌రెడ్డి ఆస్తులపై... హైకోర్టు లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. సీఎం రేవంత్ మా సవాల్‌ను స్వీకరించాలి.. మేం ఎలాంటి శిక్షకైనా సిద్ధం’ అంటూ సవాల్ విసిరారు.


22Aపై మంత్రి, సీఎం ప్రకటనలు విరుద్ధంగా ఉన్నాయని కేటీఆర్ అన్నారు. సీఎం ఇల్లు నిషేధిత జాబితాలో ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయా అంటూ నిలదీశారు. బీఆర్‌ఎస్ నేతలపై సీఎం ఇష్టానుసారంగా ఆరోపణలు చేశారంటూ ఫైర్ అయ్యారు. రేవంత్ ప్రతి స్కీమ్‌లో స్కామ్ ఉంటుందని ఆరోపించారు. తమపై సస్పెన్షన్ ఎత్తివేస్తే సభకు వచ్చి చర్చలో పాల్గొంటామన్నారు. కళ్లలోకి కళ్లు పెట్టి చూడలేక కాదని.. కాలర్ పట్టుకుని ప్రశ్నిస్తామని తెలిపారు. ప్రభుత్వానికి దమ్ముంటే అసెంబ్లీని నెల రోజులు నిర్వహించాలని కేటీఆర్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్

వాళ్లకు భయపడి చరిత్రను దాచిపెట్టారు.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై కిషన్ రెడ్డి ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 17 , 2026 | 12:19 PM