బిర్యానీ ఇలా కూడా తినొచ్చా.. చైనా యువతి స్పూన్‌లను ఎలా పట్టుకుందో చూడండి..
ABN , Publish Date - Sep 17 , 2026 | 12:34 PM
భారతీయ ఆహారానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివిధ దేశాలకు చెందిన వారు భారతీయ వంటకాలను రుచి చూస్తూ తమ అనుభవాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటుంటారు.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయ ఆహారానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివిధ దేశాలకు చెందిన వారు భారతీయ వంటకాలను రుచి చూస్తూ తమ అనుభవాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటుంటారు. తాజాగా ఓ చైనా యువతి తొలిసారి బిర్యానీని రుచి చూస్తూ చేసిన పని నెటిజన్లను ఆకట్టుకుంటోంది (Chinese woman tries biryani).
వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ చైనా యువతి ముందు బిర్యానీ ఉంది. ఆ బిర్యానీని తినేందుకు ఆమె చాలా ఆసక్తి చూపించింది. అయితే ఆమె స్పూన్‌లను ఉపయోగించిన విధానం చాలా మందిని ఆకట్టుకుంటోంది. సాధారణంగా బిర్యానీని స్పూన్‌తో తింటారు. అయితే ఆమె రెండు స్పూన్‌లను చాప్‌స్టిక్స్‌లా పట్టుకుని, బిర్యానీని తినేందుకు ప్రయత్నించింది. బిర్యానీని ఇలా వింతగా తినడం చాలా మందికి నవ్వు తెప్పిస్తోంది (Chinese woman Indian food).
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (biryani viral video). ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు వేల మంది వీక్షించారు. ఈ వీడియోపై తమదైన శైలిలో కామెంట్లు చేశారు. 'ఆమె చాప్‌స్టిక్స్‌కు అలవాటు పడిపోయింది' అని ఒకరు కామెంట్ చేశారు. ఆమె స్పూన్ పట్టుకున్న విధాన్యం అత్యద్భుతమని కొందరు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
రష్యాపై భారీ ఆంక్షల బిల్లుకు అమోదం.. భారత్, చైనాపై 100 శాతం సుంకాలకు ఛాన్స్..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..