రష్యాపై భారీ ఆంక్షల బిల్లుకు అమోదం.. భారత్, చైనాపై 100 శాతం సుంకాలకు ఛాన్స్..
ABN , Publish Date - Sep 17 , 2026 | 07:21 AM
రష్యాపై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచే కీలక బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. ప్రతినిధుల సభలో ఈ బిల్లు 262–159 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. దీంతో ఇది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం కోసం వైట్‌హౌస్‌కు చేరింది.
ఇంటర్నెట్ డెస్క్: రష్యాపై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచే కీలక బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. ప్రతినిధుల సభలో ఈ బిల్లు 262–159 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. దీంతో ఇది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం కోసం వైట్‌హౌస్‌కు చేరింది. అంతకుముందు ఆగస్టులో సెనెట్‌లో ఈ బిల్లు 86–11 ఓట్లతో ఆమోదం పొందింది. ఈ చట్టానికి దివంగత సెనేటర్ లిండ్సే గ్రాహమ్ పేరు పెట్టారు. రష్యా ఉక్రెయిన్‌పై కొనసాగిస్తున్న యుద్ధానికి ఆర్థికంగా మద్దతు అందించే మార్గాలను దెబ్బతీయడం ఈ చర్య ప్రధాన లక్ష్యంగా ఉంది (US Russia sanctions bill 2026).
కొత్త చట్టంలో రష్యా ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచే కీలక రంగాలను లక్ష్యంగా చేసుకునే నిబంధనలు ఉన్నాయి. రష్యా బ్యాంకులు, ఇంధన రంగం, రక్షణ రంగంతో పాటు రష్యా చమురు రవాణాకు ఉపయోగిస్తున్నట్లు పాశ్చాత్య దేశాలు పేర్కొంటున్న నౌకల వ్యవస్థపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు ఇతర సీనియర్ అధికారులను కూడా ఆంక్షల పరిధిలోకి తీసుకురావడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది (India 100% tariff).
ఈ బిల్లులో అత్యంత ప్రాధాన్యం ఉన్న అంశాల్లో ఒకటి రష్యా నుంచి చమురు, సహజవాయువును కొనుగోలు చేసే దేశాలపై అదనపు సుంకాలు విధించే అధికారాన్ని అధ్యక్షుడికి ఇవ్వడం. రష్యా ఇంధనాన్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లభిస్తుంది. ఈ పరిధిలో భారత్, చైనా కూడా ఉండే అవకాశం ఉంది (Trump Russia sanctions).
సెనెట్, ప్రతినిధుల సభ రెండింటిలోనూ ఈ బిల్లు ఆమోదం పొందడంతో ఇప్పుడు తదుపరి దశ అధ్యక్షుడి సంతకం (Russia Ukraine war). ఈ బిల్లుపై తాను సంతకం చేస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్న భారత్, చైనా విషయంలో 100 శాతం వరకు సుంకాలు విధించే అధికారాన్ని ట్రంప్ ఎలా ఉపయోగిస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి..
భారత సినీ రంగానికి అనంత్ నాగ్ సేవలు స్ఫూర్తిదాయకం: పవన్ కల్యాణ్
రుణాల మంజూరుపై బ్యాంకులు దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు