Share News

పచ్చి వడ్లకు డిమాండ్

ABN , Publish Date - Oct 16 , 2026 | 01:00 PM

కరీంనగర్ జిల్లాలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఎల్‌నినో ప్రభావంతో ఈసారి ధాన్యం దిగుబడి తగ్గే అవకాశం కనిపిస్తోంది.

పచ్చి వడ్లకు డిమాండ్
Karimnagar paddy prices

  • జై శ్రీరాం’ క్వింటాల్‌కు రూ.4వేలు

  • సన్న రకాల కొనుగోలుకు పోటీ పడుతున్న ప్రైవేట్‌ వ్యాపారులు

  • ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

జిల్లాలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఎల్‌నినో ప్రభావంతో ఈసారి ధాన్యం దిగుబడి తగ్గే అవకాశం కనిపిస్తోంది. యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నా య పంటలు వేయాలని ప్రభుత్వం సూచిస్తుండడంతో వానాకాలంలో పండిన వరి ధాన్యానికి మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగింది. ఇప్పుడిప్పుడే అక్కడక్కడ పొలాలు కోస్తుండడంతో ప్రైవేట్‌ వ్యాపారులు, మిల్లర్లు కల్లాల వద్దకే వెళ్లి పచ్చి వడ్లనే మద్దతు ధర కంటే ఎక్కువ చెల్లించి కొనుగోలు చేస్తున్నారు.


సాధారణ రకాల ధాన్యానికి క్వింటాల్‌కు మూడు వేల నుంచి 3,200, జైశ్రీరాం రకానికి 3,800 నుంచి నాలుగు వేల రూపా యలు చెల్లించి కొనుగోలు చేశారు. హైదరాబాద్‌, మిర్యాలగూడకు చెందిన మిల్లర్లు, వ్యాపారులు జిల్లా లకు వెళ్లి కోతలు ప్రారంభం కాగానే సన్న వరి రకాలను ప్రభుత్వ మద్దతు, బోనస్‌ ధర కంటే ఎక్కువ చెల్లించి కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకు న్నారని వ్యాపారవర్గాలు పేర్కొంటున్నాయి. స్థానిక మిల్ల ర్లు కూడా ధాన్యం కొనేందుకు సన్నద్ధమవుతున్నారు.


  • ప్రైవేట్‌లోనే ఎక్కువ ధర

మార్కెట్‌లో వరి ధాన్యానికి డిమాండ్‌ పెరుగడంతో ప్రైవేట్‌లోనే రైతులకు ఎక్కువ ధర లభించే అవకాశ మున్నది. కొనుగోలు కేంద్రాలకు వస్తే తేమ, తాలు, తరుగు పేరిట ధాన్యంలో బస్తాకు 2 నుంచి 4 కిలోల తరుగు తీయడం, ధర తక్కువ ఇవ్వడం జరుగుతు న్నది. ఇప్పుడు ప్రైవేట్‌ వ్యాపారులు అవేవి పట్టించు కోకుండా కల్లాల వద్దే పచ్చి ధాన్యాన్ని ఎక్కువ ధరకు కొనేందుకు సిద్ధమవడమే కాకుండా అక్కడక్కడ కొంటు న్నందున కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తక్కువే వస్తుందని భావిస్తున్నారు.


paddy1.jpg

  • 6.25 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా

జిల్లావ్యాప్తంగా 6.25 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇం దులో నుంచి కొనుగోలు కేంద్రాలకు 2.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే వస్తుందని భావిస్తున్నారు. అందులో 1.8 లక్షల టన్నులు సన్నరకాలు, 70 వేల టన్నులు దొడ్డు రకాలు కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకు వచ్చే అవకాశం ఉంది.


జిల్లాలో 318 కొనుగోలు కేంద్రాలు

వానా కాలం వరి ధాన్యం కొనుగోలు కోసం జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధంచేస్తోంది. మరో 10, 15 రోజుల్లో వరి కోతలు ముమ్మరం కానుండగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించారు. జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోలుకు 318 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఐకేపీ ఆధ్వర్యంలో 91, ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో 179, డీసీఎంఎస్‌ ద్వారా 91, హాకా ద్వారా తొమ్మిది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. వరి కోతలు నెలా ఖరు వరకు ముమ్మరం అయ్యే అవకాశమున్నందున అప్పటి వరకు ఈ కొనుగోలు కేంద్రాలను ఆయా గ్రామాల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


  • 1.79 లక్షల ఎకరాల్లో సన్నరకాల సాగు

జిల్లాలో 2,65,734 ఎకరాలలో వరి సాగు చేశా రు. ఇందులో ప్రభుత్వం సూచించిన బీపీటి, తెలం గాణ ఆర్‌ఎన్‌ఆర్‌, కేఎన్‌ఎం-1638, కెఎన్‌ఎం-7715, హెచ్‌ఎంటీ డబ్ల్యుజీ 44, జై శ్రీరాంలాంటి సన్న రకాలను 1,79,671 ఎకరాల్లో సాగు చేశారు. ఏ- గ్రేడ్‌ వరిని 53,426 ఎకరాల్లో, కామన్‌ రకాలను 32,637 ఎకరాల్లో సాగు చేశారు. ప్రస్తుతం ఉన్న పంటల అంచనా ప్రకారం 4,15,128 మెట్రిక్‌ టన్నుల సన్న ధాన్యం, 1,30,894 మెట్రిక్‌ టన్నుల ఏ-గ్రేడ్‌ ధాన్యం, 79,961 మెట్రిక్‌ టన్నుల కామన్‌ దొడ్డు రకం దిగుబడిగా వస్తుందని అంచనా వేస్తు న్నారు. ప్రభుత్వం సన్నరకాలకు క్వింటాల్‌కు 2, 461 రూపాయలు మద్దతు ధరగా 500 రూపాయ లు బోనస్‌గా చెల్లిస్తున్నది. సన్నరకాలకు కొనుగో లు కేంద్రాల్లో క్వింటాల్‌కు 2,961 ధర లభించను న్నది. కామన్‌ దొడ్డు రకానికి క్వింటాల్‌కు 2,441, ఏ-గ్రేడ్‌ ధాన్యానికి రూ. 2,461ల ధర చెల్లిస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి:

సగం మంది వెన్నునొప్పి బాధితులే..!

బార్ల లక్కీ డ్రాకు ఏర్పాట్లు పూర్తి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 16 , 2026 | 01:00 PM