Share News

చాక్‌పీస్‌పై జాతీయ జెండా, అక్షరాలు..

ABN , Publish Date - Aug 15 , 2026 | 11:57 AM

కరీంనగర్ జిల్లా ఓదెల మండలంలోని మడక గ్రామానికి చెందిన ఆడెపు రజనీకాంత్‌ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చాక్‌పీస్‌పై జాతీయ జెండాను సుమారు మూడు గంటల పాటు శ్రమించి తయారు చేశారు.

చాక్‌పీస్‌పై జాతీయ జెండా, అక్షరాలు..
Karimnagar micro artist

  • సూక్ష్మకళాకారుడి ప్రతిభ..

ఓదెల(కరీంనగర్): కరీంనగర్ జిల్లా ఓదెల మండలంలోని మడక గ్రామానికి చెందిన చిత్రకళ ఉపాధ్యాయుడు ఆడెపు రజనీకాంత్‌ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చాక్‌పీస్‌పై 2.6 సెంటీమీటర్ల ఎత్తు, ఒక సెంటీ మీటర్‌ వెడల్పు ఉన్న జాతీయ జెండాను సుమారు మూడు గంటల పాటు శ్రమించి తయారు చేశారు. ఆరు మిల్లీమీటర్ల ఎత్తు, నాలుగు మిల్లీమీటర్ల వెడల్పు ఉన్న హ్యాపీ ఇండిపెండెన్స్‌ డే ఆంగ్ల అక్షరాలను సుమారు గంటపాటు తయారు చేశారు. 1.5 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న నాలుగు జాతీయ పతాకాలను, చాక్‌ పీస్‌ ముక్కలతో ఐ లవ్‌ ఇండియా అనే అక్షరాలను సుమారు గంటన్నర పాటు శ్రమించి గుండు పిన్ను సాయంతో తయారుచేసి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.


jmt1.2.jpgరజనీకాంత్‌ గతంలో తన సూక్ష్మ కళతో ప్రపంచంలోనే అతి చిన్న జాతీయ పతాకాన్ని నాలుగు మిల్లీ మీటర్ల ఎత్తుతో చెక్కి క్రెడెన్స్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌లో చోటు సంపాదించాడు. బియ్యపు గింజలపై జాతీయ గీతం జనగణ మన, జాతీయ గేయం వందేమాతరం అక్షరాలను రాసి ప్రపంచ రికా ర్డులను సొంతం చేసుకున్నారు. మైక్రోఆర్ట్‌లో సూక్ష్మ కళతో ప్రతిభ కన బరుస్తున్న రజనీకాంత్‌ను పలువురు అభినందించారు.


jmt1.3.jpgఈ వార్తలు కూడా చదవండి:

గ్యాస్‌ ఈకేవైసీకి రేపే ఆఖరు తేదీ

180 రోజులు ట్రాఫిక్‌ ఆంక్షలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 15 , 2026 | 11:57 AM