గ్యాస్ ఈకేవైసీకి రేపే ఆఖరు తేదీ
ABN , Publish Date - Aug 15 , 2026 | 11:00 AM
గ్యాస్ వినియోగదారులు తప్పనిసరిగా ఈకేవైసీని చేసుకోవాలని, ఇందుకు ఈనెల 16వ తేదీ సాయంత్రం వరకు అవకాశముంది.
గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారుల క్యూ
కుత్బుల్లాపూర్(హైదరాబాద్): గ్యాస్ వినియోగదారులు తప్పనిసరిగా ఈకేవైసీని చేసుకోవాలని, ఇందుకు ఈనెల 16వ తేదీ సాయంత్రం వరకు అవకాశముంది. అయితే పలు కంపెనీలకు చెందిన గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు వినియోగదారులకు మెసేజ్‌లు, ఫోన్‌లు చేసి ఈకేవైసీని తప్పనిసరిగా చేసుకోవాలని, లేకుంటే గ్యాస్ రాదని స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇలా చేయకపోతే సబ్సిడీ రద్దవు తుందని, ఆంక్షలు విధించే అవకాశముందని పలువురు చర్చించుకుంటున్నారు.
దీంతో శుక్రవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గ్యాస్ ఏజెన్సీల వద్దకు ఈకేవైసీని చేసుకునేందుకు వినియోగదారులు క్యూకట్టారు. అయితే శనివారం స్వాతంత్య్ర దినోత్సవం, ఆదివారం సెలవులు కావడంతో ప్రజలు సందేహంలో ఉన్నారు. ఏజెన్సీల నిర్వాహకులను వివరణ కోరగా.. శని, ఆదివారం వర్కింగ్ డేగా ఉందని తెలుస్తోందని, పై నుంచి తేదీని పెంచితే సెలవు ఉంటుందని తెలుపుతున్నారు. ఏది ఏమైనా త్వరితగతిన ఏజెన్సీల వద్దకు వెళ్లి ఈకేవైసీ చేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
రేషన్ కార్డులపై సీఎం, మంత్రి ఫొటోలెందుకు?
Read Latest AP News And Telangana News And International News And Telugu News