సీతాఫల్‌మండి బోనాలకు వేళాయె..
ABN , Publish Date - Aug 15 , 2026 | 10:40 AM
సీతాఫల్‌మండి మేడిబావిలోని పోచమ్మ, ముత్యాలమ్మ ఆలయంలో ఆదివారం బోనాలు ఘనంగా జరగనున్నాయి.
ముస్తాబైన పోచమ్మ, ముత్యాలమ్మ ఆలయం
రేపు ఉత్సవాలు ప్రారంభం
బౌద్ధనగర్(హైదరాబాద్): సీతాఫల్‌మండి మేడిబావిలోని పోచమ్మ, ముత్యాలమ్మ ఆలయంలో ఆదివారం బోనాలు ఘనంగా జరగనున్నాయి. ఆలయాన్ని ఇప్పటికే విద్యుత్ దీపాలతో సుందరంగా అలకరించారు. సీతాఫల్‌మండి, మేడిబావి, ఇందిరానగర్‌కాలనీ, వారాసిగూడ తదితర ప్రాంతాల వారు ఈ బోనాల వేడుకల్లో పాల్గొనున్నారు. సుమారు పదివేల మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొంటారని నిర్వాహాకులు తెలిపారు. ఆది, సోమవారం జరిగే బోనాల వేడుకల్లో సుమారు పది ఫలహారబండ్లు, తొట్టెల ఊరేగింపు, రంగం నిర్వహించనున్నారు.
ఈ వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, సికింద్రాబాద్, సనత్‌నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు తీగుళ్ల పద్మారావుగౌడ్, తలసాని శ్రీనివా్‌సయాదవ్, మాజీ కార్పొరేటర్లు సామల హేమ తదితరులు ముఖ్యఅతిథులుగా పాల్గొంటారని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు, చైర్మన్ కళాప్రకాశ్‌లు తెలిపారు. మేడిబావి బోనాలు పురస్కరించుకుని ఆలయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ తెలిపారు.
ఆలయ చరిత్ర...
ఈ ఆలయానికి ఘనమైన చరిత్ర ఉంది. సుమారు వంద సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారు. సీతాఫల్‌మండి రామేలింగేశ్వరస్వామి ఆలయానికి ఈ ఆలయం ఉప ఆలయంగా కొనసాగింది. తర్వాత 1997లో ఆలయ చైర్మన్ పరికిబండ కళాప్రకాశ్ పోచమ్మ, ముత్యాలమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఆదివారం తెల్లవారుజామున తమకుటుంబం తొలి బోనం సమర్పించిన అనంతరం బోనాల వేడుకలు ప్రారంభం అవుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
భక్తులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు
బోనాల వేడుకలలో పాల్గొనే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఆలయ చైర్మన్ కళాప్రకాశ్ తెలిపారు. మహిళలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఆలయ పరిసరా ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. వేడుకలకు భక్తులందరూ సహకరించాలని ఆయన కోరారు.
పరికిబండ కళాప్రకాశ్, ఆలయ చైర్మన్
ఈ వార్తలు కూడా చదవండి:
రేషన్ కార్డులపై సీఎం, మంత్రి ఫొటోలెందుకు?
Read Latest AP News And Telangana News And International News And Telugu News