Share News

నవ భారత నిర్మాణంలో ప్రతి పౌరుడు కర్తవ్యనిష్టతో ముందుకు సాగాలి: సీఎం రేవంత్

ABN , Publish Date - Aug 15 , 2026 | 09:15 AM

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్య్ర వేడుకలు ప్రజల్లో నూతన ఉత్సాహం, చైతన్యం నింపాలన్నారు.

నవ భారత నిర్మాణంలో ప్రతి పౌరుడు కర్తవ్యనిష్టతో ముందుకు సాగాలి: సీఎం రేవంత్
CM Revanth Reddy

హైదరాబాద్, ఆగస్టు 15: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్య్ర వేడుకలు ప్రజల్లో నూతన ఉత్సాహం, చైతన్యం నింపాలన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి కొత్త ఊపునివ్వాలని ఆకాంక్షించారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతూ దేశభక్తి, పరస్పర గౌరవం పెంపొందించాలని అన్నారు. అసమానతలు లేని శాంతియుత, సౌభ్రాతృత్వ భారతదేశాన్ని నిర్మించాలని తెలిపారు.


సమరయోధుల త్యాగాలకు అదే నిజమైన నివాళి అని సీఎం వ్యాఖ్యానించారు. సమన్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వంతో 80వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోవాలని ఆకాంక్షించారు. నవ భారత నిర్మాణంలో ప్రతి పౌరుడు కర్తవ్యనిష్టతో ముందుకు సాగాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.


ఇవి కూడా చదవండి...

ప్రతి హృదయం వందేమాతరం నినాదంతో మార్మోగుతోంది: ప్రధాని మోదీ

దేశ భవిష్యత్తును మరింత గొప్పగా నిర్మించడమే మహనీయుల త్యాగాలకు నిజమైన నివాళి: సీఎం చంద్రబాబు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 15 , 2026 | 10:00 AM