Share News

దేశ భవిష్యత్తును మరింత గొప్పగా నిర్మించడమే మహనీయుల త్యాగాలకు నిజమైన నివాళి: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Aug 15 , 2026 | 08:53 AM

పంద్రాగస్టు నేపథ్యంలో తెలుగు వారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

దేశ భవిష్యత్తును మరింత గొప్పగా నిర్మించడమే మహనీయుల త్యాగాలకు నిజమైన నివాళి: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

అమరావతి, ఆగస్టు15: పంద్రాగస్టు నేపథ్యంలో తెలుగు వారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలుగువారికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితమే మన స్వాతంత్ర్యం. వారి త్యాగాలకు నిజమైన నివాళి అంటే దేశ భవిష్యత్తును మరింత గొప్పగా నిర్మించడమే. అందుకు ‘అనే నేను..’ సంకల్పంతో దేశం నాకు ఏం చేసిందని కాదు.. దేశానికి నేను ఏం చేయగలనని అందరూ ఆలోచించాలి’.


‘మన చేతిలో జాతీయ జెండా ఉండాలి.. మన గుండెల్లో దేశం కోసం బలమైన అజెండా ఉండాలి. 2047 నాటికి వికసిత్ భారత్.. స్వర్ణాంధ్ర సాకారం చేయాలన్న సమున్నత లక్ష్యంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. 100 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల నాటికి దేశం, రాష్ట్రం స్వాతంత్ర్యం నుంచి సమృద్ధి వైపు.. వికాసం నుంచి వైభవం వైపు ముందుకు సాగాలి. ఈ సంకల్పాన్ని నెరవేర్చుకునేందుకు ఐక్యంగా కలిసి అడుగులు వేద్దాం. జై తెలుగుతల్లి! జై హింద్!’ అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రతి హృదయం వందేమాతరం నినాదంతో మార్మోగుతోంది: ప్రధాని మోదీ

పంద్రాగస్టు వేడుకలకు ముస్తాబైన భారతావని

For More AP News And Telugu News

Updated Date - Aug 15 , 2026 | 09:51 AM