Share News

ఏపీకి 7 శౌర్య పతకాలు

ABN , Publish Date - Aug 15 , 2026 | 08:33 AM

స్వా తంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోం శాఖ శుక్రవారం ప్రకటించిన శౌర్య, సేవా పతకాల్లో మన రాష్ట్రానికి 27 లభించాయి. దేశవ్యాప్తంగా పోలీసు, అగ్నిమాపక దళం, హోంగార్డు, పౌర రక్షణ, జైళ్ల శాఖలకు చెందిన 1,057 మంది సిబ్బందికి కేంద్రం శౌర్య, సేవా పతకాలను ప్రకటించింది.

ఏపీకి 7 శౌర్య పతకాలు
AP Police

  • ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ఠ సేవ, 14 మందికి విశిష్ఠ సేవా పతకాలు కూడా..

  • దేశంలో 1,057 మందికి శౌర్య, సేవా పతకాలు

  • కేంద్ర హోం శాఖ ప్రకటన

న్యూఢిల్లీ: స్వా తంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోం శాఖ శుక్రవారం ప్రకటించిన శౌర్య, సేవా పతకాల్లో మన రాష్ట్రానికి 27 లభించాయి. దేశవ్యాప్తంగా పోలీసు, అగ్నిమాపక దళం, హోంగార్డు, పౌర రక్షణ, జైళ్ల శాఖలకు చెందిన 1,057 మంది సిబ్బందికి కేంద్రం శౌర్య, సేవా పతకాలను ప్రకటించింది. వీరిలో 301 మందికి శౌర్య పతకాలు, 92 మందికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 664 మందికి విశిష్ఠ సేవా పతకాలు దక్కాయి. వీటిలో ఏపీకి 7 శౌర్య పతకాలు, 2 రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 14 విశిష్ఠ సేవా పతకాలు లభించాయి. ఇక తెలంగాణకు చెందిన 18 మంది శౌర్య, సేవా పతకాలు దక్కించుకున్నారు.


వీటిలో 3 శౌర్య, 2 రాష్ట్రపతి విశిష్ఠ సేవా, 10 విశిష్ఠ సేవా పతకాలు ఉన్నాయి. అగ్నిమాపక విభాగంలో తెలుగు రాష్ట్రాలకు రెండు చొప్పున విశిష్ఠ సేవా పతకాలు, జైళ్ల శాఖ విభాగంలో ఏపీకి 2 విశిష్ఠ సేవా పతకాలు లభించాయి. కాగా, సశస్త్ర సీమా బల్‌ ఐజీగా పని చేస్తున్న ఏపీకి చెందిన మాలోతు రాములునాయక్‌, అలాగే సీఆర్‌పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ అయిన తెలుగు అధికారి డి.జయచంద్రనాయుడికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు దక్కాయి. దక్షిణ మధ్య రైల్వే సబ్‌ఇన్‌స్పెక్టర్‌ గురుప్రసాద్‌ నగరికంటికి కూడా విశిష్ఠ సేవా పతకం లభించింది.


పతకాలు దక్కించుకున్న ఏపీ సిబ్బంది

ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ సర్వీస్‌ విభాగం నుంచి ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుళ్లు కె.మల్లేశ్‌, పైడి శ్రీరామమూర్తి, ఏఆర్‌ కానిస్టేబుళ్లు హేమసుందరరావు, చింతపల్లి సత్యనారాయణ, రౌతు మహేశ్‌, ఆబోతుల అప్పలనాయుడు, రూతాల కన్నబాబుకు శౌర్య పతకాలు లభించాయి. ఐజీ అధికారులు విజయకుమార్‌ గూడి, బి. వెంకట రామిరెడ్డికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు దక్కాయి. పోలీస్‌ సర్వీస్‌ విభాగంలో గీతాదేవి(ఎస్పీ), సుబ్బారావు తుమ్మల(డీఎస్పీ), జగ్గునాయుడు పెంట(డీఎస్పీ), ఐ.రామకృష్ణ(ఏఎస్పీ), సదేపల్లి చంద్రమోహన్‌(డీఎస్పీ), కాన్‌జాక్సన్‌ పసుపులేటి(డీఎస్పీ), మహబూబ్‌ బాషా సయిద్‌(అసిస్టెంట్‌ కమాండెంట్‌), శ్రీనివాసరాజు మంతెన(హెడ్‌ కానిస్టేబుల్‌), ఎం. రామప్రసాద్‌(ఆర్మ్డ్‌ పోలీస్‌ ఎస్‌ఐ), మోహన్‌రావు(ఏఎస్ఐ), శేషాపాణి పగడాల(ఆర్మ్డ్‌ పోలీస్‌ ఎస్‌ఐ), రాజారావు రోలుపల్లి(హెడ్‌ కానిస్టేబుల్‌), బసవయ్య పొదిలి(ఆర్మ్డ్‌డ్‌ ఎస్‌ఐ), ఎన్‌.చెంచురామయ్య(ఏఎ్‌సఐ)కు విశిష్ఠ సేవా పతకాలు లభించాయి. అగ్నిమాపక విభాగంలో సత్యనారాయణ కాపు(డిస్ట్రిక్ట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ ఆఫీసర్‌), జాశారయ్య పెనుమాక(ఫైర్‌మెన్‌)కు, జైళ్ల శాఖ విభాగంలో రాహుల్‌ శ్రీరామ(సూపరిండెంటెంట్‌ ఆఫ్‌ జైల్స్‌), సూర్య ప్రకాశరావు అద్దంకి(హెడ్‌ వార్డర్‌)కు విశిష్ఠ సేవా పతకాలు లభించాయి.

Updated Date - Aug 15 , 2026 | 08:38 AM