Share News

తెలంగాణలో సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

ABN , Publish Date - Aug 15 , 2026 | 10:54 AM

సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం తమది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గోల్కొండ కోటపై సీఎం జాతీయ జెండాను ఆవిష్కరించారు.

తెలంగాణలో సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy

హైదరాబాద్, ఆగస్టు 15: సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం తమది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గోల్కొండ కోటపై సీఎం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ.. ఈ ప్రభుత్వ 32 నెలల కృషి ఇప్పుడిప్పుడే కనిపిస్తోందని.. తలసరి ఆదాయంలో టాప్‌లో ఉన్నామన్నారు. వ్యవసాయాన్ని పండగ చేయాలని నిర్ణయించామని తెలిపారు. రైతు బాగుంటేనే.. రాష్ట్రం బాగుంటుందన్న ముఖ్యమంత్రి.. రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు చేపట్టామన్నారు. రైతు భరోసా కింద రూ.36వేల కోట్లు పెట్టుబడి సాయం అందించామని చెప్పారు. అలాగే, రైతు సంక్షేమం కోసం రూ.లక్షా 70వేల కోట్లు, రూ.2లక్షల వరకు రైతు రుణమాఫీ చేశామని వివరించారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రికార్డులు సృష్టించిందని తెలిపారు.


కృష్ణా-గోదావరి జలాల్లో రాజీపడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును సాధించి తీరుతామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి రైతుల కళ్లల్లో ఆనందం చూస్తామన్నారు. త్వరలోనే పాలమూరు పూర్తి చేసి నీరందిస్తామని తెలిపారు. వ్యవసాయంతో పాటు ఇళ్లకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని, కల్యాణలక్ష్మి కింద ఆడబిడ్డలకు రూ.4,790 కోట్లు అందజేశామని అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే సంకల్పంతో ఉన్నామని చెప్పుకొచ్చారు. 15 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని,2 విడతల్లో 5.50లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్లు నిర్మించి అందించనున్నామని తెలియజేశారు.


దేశంలోనే తొలిసారి తెలంగాణలో కులగణన జరిగిందని.. తెలంగాణ ఒత్తిడి వల్లే కేంద్రం జనగణనలో కులగణన చేర్చిందని తెలిపారు. కొత్తగా 2.50లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేస్తున్నామన్నారు. సినీ కార్మికుల సంక్షేమం కోసం త్వరలో బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. విద్యా సూచీలో 21 నుంచి 14వ స్థానానికి తెలంగాణ చేరిందని రేవంత్ తెలిపారు. నియోజకర్గానికొక ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాన్ని చేపట్టామన్నారు. స్కూళ్లలో అల్పాహారం, మధ్యాహ్న భోజనం పెడుతున్నామని, 100కు పైగా తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు నిర్మించే యోచనలో ఉన్నామని చెప్పారు. అక్రమాలు జరగకుండా TGPSCని ప్రక్షాళన చేశామన్నారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

నవ భారత నిర్మాణంలో ప్రతి పౌరుడు కర్తవ్యనిష్టతో ముందుకు సాగాలి: సీఎం రేవంత్

గోల్కొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 15 , 2026 | 11:25 AM