అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య వేడుకలు.. జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Aug 15 , 2026 | 09:27 AM
ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అమరావతి, ఆగస్టు 15: ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్‌లో స్వర్ణాంద్ర-2047 థీమ్‌తో వేడుకలు నిర్వహించారు. రాజధానిలో జరుగుతోన్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుక జరిగే వేదిక వద్దకు సీఎం కాన్వాయ్‌తో బుల్లెట్ ఎస్కార్ట్ చేరుకుంది.
ఈ సందర్భంగా సీఎంకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఆపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు. పోలీసు దళాల గౌరవ వందనాన్ని ముఖ్యమంత్రి స్వీకరించారు. ఏపీఎస్పీ సహా వివిధ పోలీసు దళాల సన్నద్ధతను చంద్రబాబు సమీక్షించారు. అనంతరం పోలీసు బలగాలు, ఎన్సీసీ క్యాడెట్లు, సీఆర్పీఎఫ్, కర్ణాటక పోలీసు దళం.. మార్చ్ పాస్ట్ నిర్వహించాయి.
ఇవి కూడా చదవండి...
ప్రతి హృదయం వందేమాతరం నినాదంతో మార్మోగుతోంది: ప్రధాని మోదీ
దేశ భవిష్యత్తును మరింత గొప్పగా నిర్మించడమే మహనీయుల త్యాగాలకు నిజమైన నివాళి: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News