Share News

స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి ఆనంకు అస్వస్థత

ABN , Publish Date - Aug 15 , 2026 | 11:18 AM

స్వాతంత్య్ర వేడుకల్లో రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అస్వస్థత గురయ్యారు. తిరుపతి పోలీస్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకలకు ఆనం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి ఆనంకు అస్వస్థత
anam rama Narayana reddy

తిరుపతి, ఆగస్టు 15: స్వాతంత్య్ర వేడుకల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అస్వస్థత గురయ్యారు. ఇవాళ(బుధవారం) తిరుపతి పోలీస్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకలకు మంత్రి రామనారాయణరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రసంగిస్తున్న సమయంలో స్పృహతప్పి ఒక్కసారిగా పక్కకు వాలిపోయారు.


వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మంత్రి కింద పడకుండా పట్టుకున్నారు. బీపీ డౌన్ అయినట్లు గుర్తించిన వైద్యులు.. సకాలంలో మంత్రికి ప్రాథమిక చికిత్స అందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాసేపటి తర్వాత మంత్రి ఆనం స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రి ప్రసంగాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు కంటిన్యూ చేశారు.


ఇవి కూడాా చదవండి:

ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్: డిప్యూటీ సీఎం పవన్

జాతీయ జెండా స్వాతంత్ర్యానికి ప్రతీక.. ఆత్మగౌరవానికి ప్రతిబింబం: సీఎం చంద్రబాబు

Updated Date - Aug 15 , 2026 | 11:26 AM