ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్: డిప్యూటీ సీఎం పవన్
ABN , Publish Date - Aug 15 , 2026 | 10:41 AM
బలమైన, సమర్థవంతమైన దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ అడుగులు వేస్తోందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. శనివారం కాకినాడలోని పోలీస్ పరేడ్ మైదానంలో 80వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా ఆయన త్రివర్ణ పతాకం ఎగురవేశారు.
కాకినాడ, ఆగస్టు15: బలమైన, సమర్థవంతమైన దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ అడుగులు వేస్తోందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. శనివారం కాకినాడలోని పోలీస్ పరేడ్ మైదానంలో 80వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా ఆయన త్రివర్ణ పతాకం ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒక తరం స్వాతంత్ర్యం కోసం పోరాడితే.. ఒక తరం కాపాడిందని పేర్కొన్నారు.
వికసిత్ భారత్ సంకల్పంలో ఆంధ్రప్రదేశ్ తనదైన పాత్ర పోషిస్తుందని అన్నారు. కేంద్ర సమన్వయంతో అభివృద్థి పథంలో ముందుకు సాగుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వీకరించారు.
ఇవి కూడా చదవండి..
జాతీయ జెండా స్వాతంత్ర్యానికి ప్రతీక.. ఆత్మగౌరవానికి ప్రతిబింబం: సీఎం చంద్రబాబు
దేశ భవిష్యత్తును మరింత గొప్పగా నిర్మించడమే మహనీయుల త్యాగాలకు నిజమైన నివాళి: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News