Share News

పడిపోతున్న పత్తి ధర

ABN , Publish Date - Nov 20 , 2026 | 12:55 PM

ప్రారంభంలో మురిపించిన పత్తి ధర పంట రోజురోజుకు తగ్గిపోతున్నది. జమ్మికుంట మార్కెట్‌లో క్విం టాల్‌కు 9,250 చొప్పున పలికిన ధర ప్రస్తుతం మద్దతు ధరకు దగ్గరగా వచ్చింది.

పడిపోతున్న పత్తి ధర
Cotton Price Fall

  • ఆందోళనలో రైతులు

  • సీసీఐ కేంద్రాలు ఉన్నట్టా...లేనట్టా

  • రోజుకు క్వింటాల్‌కు రూ. 100 తగ్గిస్తున్న వ్యాపారులు

  • రూ. 9,250 నుంచి రూ.8,700లకు పడిపోయిన ధర

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ప్రారంభంలో మురిపించిన పత్తి ధర పంట రోజురోజుకు తగ్గిపోతున్నది. జమ్మికుంట మార్కెట్‌లో క్విం టాల్‌కు 9,250 చొప్పున పలికిన ధర ప్రస్తుతం మద్దతు ధరకు దగ్గరగా వచ్చింది. రోజుకు 100 నుంచి 200 రూపాయల చొప్పున ధర తగ్గిస్తూ వ్యాపారులు కొను గోలు చేస్తుంటే కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) అఽధికారికంగా కొనుగోలు కేంద్రాలను తెరవ కుండా దోబూచులాడుతోంది. జిల్లాలో పత్తి ఏరడం ముమ్మరం కావడంతో రైతులు మార్కెట్‌కు తమ దిగుబడిని వెంటవెంటనే తీసుకొని వస్తున్నారు.


  • ప్రారంభంలో మద్దతు ధరకు మించి..

ప్రారంభంలో పత్తికి మద్దతు ధర కంటే అధిక ధర రావడంతో రైతులు పంట దిగుబడి తగ్గినా నష్టాల పాలు కాకుండా గట్టెక్కవచ్చని సంతోషించారు. దిగు బడి తగ్గడంతో వ్యాపారులు కొంత ఎక్కువ ధర చెల్లిం చి కొనుగోలు చేస్తారని ఆశించారు. ప్రారంభంలో రైతు లు ఆశించిన విధంగానే ధర ఉన్నా రోజురోజుకు అది తగ్గిపోతుండడంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో 45,836 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. సాధారణంగా జిల్లాలో ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. ఎల్‌నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, చివరి రెండు తడులకు నీరు ఆశించిన విధంగా అందక పోవ డంతో దిగుబడి సగానికి పడిపోయింది. ఇప్పుడు ఎకరా కు ఏడు క్వింటాళ్ళ చొప్పున దిగుబడి వస్తే అదే గొప్ప అని భావిస్తున్నారు. ఆ లెక్కన జిల్లాలో ఈసారి 3.2 లక్షల క్వింటాళ్ళ దిగుబడి వస్తుందని అంచనా వేస్తు న్నారు. మార్కెట్‌లో దిగుబడి తగ్గినపుడు ధర పెరగ డం సాధారణంగా జరిగేదే. అయితే ఇప్పుడు కథ రివర్స్‌ అయింది. దిగుబడి తగ్గింది. దానితోపాటే వ్యాపారుల మాయాజాలం కారణంగా ధర కూడా తగ్గుతుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.


  • ఆసక్తి చూపని సీసీఐ

ప్రతిసారి మంత్రులతోనో, స్థానిక ఎమ్మెల్యేలతోనో ఈ కేంద్రాలను ప్రారంభించి కొనుగోళ్లకు శ్రీకారం చుట్టే వారు. ఈసారి అధికారికంగా వాటిని ప్రారంభిం చకుండా ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుకింగ్‌ ఓపెన్‌ చేసినట్లు చెబుతున్నారు. ప్రతక్ష్యంగా సీసీఐ కొనుగోలు కేంద్రాల కు వచ్చి పత్తి కొనుగోలు చేయని కారణంగా ముందు గా 9,250 రూపాయలకు క్వింటాల్‌ చొప్పున కొనుగోలు చేసిన వ్యాపారులు గురువారం జమ్మికుంట మార్కెట్‌ లో క్వింటాల్‌కు 8,860, గోపాల్‌రావుపేట మార్కెట్‌లో 8,800, కరీంనగర్‌, చొప్పదండి మార్కెట్లలో 8,700 రూపాయలకు కొనుగోలు చేశారు.


cott.jpgబుధవారం జమ్మి కుంటలో 9,040, కరీంనగర్‌లో 8901, గోపాల్‌రావు పేటలో 8,850, చొప్పదండిలో 8,600 రూపాయలకు కొనుగోలు చేశారు. ప్రతీరోజు 100 నుంచి 200 రూపా యల చొప్పున తగ్గిస్తూ వస్తూ ధరను మద్దతుధర స్థాయికి తీసుకువచ్చారు. సీసీఐ అధికారికంగా కొను గోలు కేంద్రాలకు వచ్చి కొనుగోళ్లు ప్రారంభించకపోతే మద్దతు ధర కంటే తక్కువకే రైతులు అమ్ముకోవలసిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. గతంలోనూ సీసీఐ తేమ శాతం ఎక్కువగా ఉందని పత్తిని కొనుగోలు చేయకుండా రిజెక్టు చేసిన సందర్బాల్లో విధిలేని పరిస్థితుల్లో రైతులు ప్రైవేట్‌ వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయిం చుకున్నారు.


ప్రస్తుతం అలాంటి పరిస్థితులు రానున్నాయేమోనని ఆందోళన చెందుతున్నారు. తుఫాన్‌ హెచ్చరికలతో వర్షం కురుస్తుం దేమోనన్న భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సీసీఐ మాత్రం ప్రైవేట్‌ వ్యాపారులు మద్దతు ధరకు మించి కొనుగోలు చేపడుతుండడంతో పత్తి విక్రయించేందుకు సీసీఐ కేంద్రాలకు రావడం లేదని అంటోంది. తాము కొనుగోలు కేంద్రాల్లో స్లాట్‌ బుకింగ్‌ ఓపెన్‌ చేసి పెట్టామని, రైతులు స్లాట్‌ బుక్‌ చేసుకుంటే కొనుగోలుచేసేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు చెబుతున్నారు. వ్యాపారులు, సీసీఐ అధికారుల సత్సంబంధాల నేపథ్యంలోనే ఈ రకమైన వ్యవహారం జరుగుతోందని రైతులు అంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం, వెండి ధరల భారీ పతనం..

మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసంలో ఈడీ సోదాలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 20 , 2026 | 12:55 PM