Share News

ఫ్యాక్ట్ చెక్: పుతిన్‌ను పొడవైన వ్యక్తి ఆహ్వానించారా..? అసలు నిజం ఇదే!

ABN , Publish Date - Nov 20 , 2026 | 12:27 PM

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌, చైనా అధికారి కైక్వికి సంబంధించిన చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఫ్యాక్ట్ చెక్: పుతిన్‌ను పొడవైన వ్యక్తి ఆహ్వానించారా..? అసలు నిజం ఇదే!

ఇంటర్నెట్ డెస్క్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌, చైనా అధికారి కైక్వికి సంబంధించిన చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ అధికారి కంటే పుతిన్ చాలా పొట్టిగా ఉన్నట్టు కనిపిస్తున్న ఫొటోలను చూసి అందరూ అవాక్కయ్యారు. నమ్మబుద్ధి కాక కొందరు ఫ్యాక్ట్ చెక్ చేస్తే అసలు విషయం బయటపడింది. ఆ చిత్రాలు ఏఐ సహాయంతో రూపొందించినవని తేటతెల్లమైంది. పుతిన్‌ కంటే కైక్వి ఎత్తుగా ఉన్న మాట వాస్తవమే. అయితే ఆ వ్యత్యాసం మరీ ఫొటోల్లో చూపించినంత లేదు. రష్యా అధ్యక్షుడి కంటే చైనా అధికారి కాస్త పొడవుగా ఉన్నారు అంతే. పుతిన్ ఎత్తు 5.7 అడుగులు ఉంటే కైక్వి 6.1 అడుగుల దాకా ఉంటారు. ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సు కోసం బుధవారం (నవంబర్ 17) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ చైనా చేరుకున్నారు. ఈ సందర్భంగా చైనా అధికారి కైక్వి ఆయనకు స్వాగతం పలికారు. ఇద్దరూ కలిసి ఎర్ర తివాచీపై నడుస్తూ ఫొటోలు దిగారు. ఇవే ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Untitled-9.jpg(ఇదే నిజమైన ఫొటో)

కాగా ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సు కోసం చైనా చేరిన రష్యా అధ్యక్షుడికి తగిన గౌరవం దక్కలేదని వార్తలు వస్తున్నాయి. ఆయనను స్వాగతించడానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ స్వయంగా వెళ్తారని అనుకున్నారంతా. దీనికి భిన్నంగా కమ్యూనిస్ట్‌ పార్టీ పొలిట్‌ బ్యూరోలో 5వ ర్యాంక్‌ అధికారి కైక్వి.. పుతిన్‌కు స్వాగతం చెప్పారు. అయితే రష్యా అధ్యక్షుడి కంటే ఈ అధికారి కొంచెం ఎత్తుగా ఉండడం మరో వివాదానికి దారి తీసింది. పుతిన్‌ను అవమానించడానికే ఆయన కన్నా పొడువుగా ఉన్న వ్యక్తిని జిన్‌పింగ్ పంపించారని ప్రచారం సాగింది. మరోవైపు సదస్సులో రష్యా అధ్యక్షుడిని జిన్‌పింగ్ పట్టించుకోలేదనే మాటలూ వినిపిస్తున్నాయి.


ఈ వార్తలూ చదవండి

గోల్డీ బ్రార్‌పై కెనడా భారీ రివార్డు.. ఆచూకీ తెలిపితే రూ.1.63 కోట్లు..

ఉగ్రదాడి ఇలా చేయండి..!

Updated Date - Nov 20 , 2026 | 12:38 PM