Share News

ఉగ్రదాడి ఇలా చేయండి..!

ABN , Publish Date - Nov 20 , 2026 | 03:32 AM

ఇప్పుడు అంతా కృత్రిమ మేధ (ఏఐ) మయం. తలనొప్పి వస్తే ఏ టాబ్లెట్‌ వేసుకోవాలో ఏఐ యాప్‌ను అడుగుతున్నాం

ఉగ్రదాడి ఇలా చేయండి..!
image

  • సచిత్రంగా వివరాలు ఇచ్చిన ఏఐ యాప్‌లు

  • అమెరికా వాచ్‌డాగ్‌ పరీక్షలో భయంకర నిజాలు

న్యూఢిల్లీ, నవంబరు 19: ఇప్పుడు అంతా కృత్రిమ మేధ (ఏఐ) మయం. తలనొప్పి వస్తే ఏ టాబ్లెట్‌ వేసుకోవాలో ఏఐ యాప్‌ను అడుగుతున్నాం. ప్రయాణానికి దగ్గర దారి కూడా ఏఐని ప్రశ్నించి కనుక్కుంటున్నాం. ఇదంతా ఓకే.. కానీ ఉగ్రదాడి ఎలా చేయాలి.. ఎక్కువమందిని చంపాలంటే ఏమి చేయాలి? అని అడిగితే.. ఏఐ చాట్‌బాట్‌లు ఏమి చేశాయో తెలుసా? ఎక్కడ నుంచి ఎలా దాడి చేస్తే లక్ష్యానికి ఎక్కువ నష్టం కలుగుతుందో.. ఎక్కువ మంది మరణించడానికి ఏమేమి చేయాలో అనే వివరాలను సచిత్రంగా అందించాయి. ఈ భయంకర పరిస్థితిని అమెరికా నిఘా వర్గాలు గుర్తించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఏఐ చాట్‌బాట్‌లు ఉగ్రదాడి ప్రణాళికలు రచించేవిగా మారాయని ధ్వజమెత్తాయి.


ఇలాంటి టెక్నాలజీ తప్పుడు చేతుల్లోకి వెళ్లకుండా నిరోధించేందుకు ఏఐ కంపెనీలు తీసుకుంటున్న చర్యలపై కాంగ్రెస్‌ వాచ్‌డాగ్‌ అమెరికా జవాబుదారీ కార్యాలయం (జీఏఓ) ప్రశ్నలు లేవనెత్తింది. న్యూహ్యాంప్‌షైర్‌ డెమోక్రాటిక్‌ సెనేటర్‌ మేగీ హసన్‌ కోరిన మీదట ఉగ్రదాడి ప్రణాళికలపై చాట్‌జీపీటీ, క్లాడ్‌, జెమినాయ్‌, గ్రోక్‌లను ఈ ఏడాది మే నెలలో జీఏఓ పరీక్షించింది. బాంబులు నింపిన కారును పార్కింగ్‌ ప్రాంతంలో ఎక్కడ పెడితే ఎక్కువ మంది మరణిస్తారో చెప్పే చిత్రాన్ని గీసి ఓ చాట్‌బాట్‌ ఆ పరీక్షల్లో అందించగా, డ్రోన్‌తో ఎలక్ట్రిక్‌ సబ్‌ స్టేషన్‌పై దాడి చేసే విధానాన్ని అంచెలంచెలుగా వివరిస్తూ మరో చాట్‌బాట్‌ ప్రణాళిక ఇచ్చింది. అయితే ఉగ్రదాడి విషయంలో జీఏఓకు సహకరించడానికి తొలుత ఆ చాట్‌బాట్‌లు నిరాకరించాయి. కానీ వాటి భద్రతా ప్రమాణాలను ఛేదించి జీఏఓ సమాధానాలు రాబట్టింది. నిజానికి హింస, నేరప్రవృత్తి, ఇతర ప్రమాద కరమైన వాటికి సూచనలు ఇవ్వకుండా ఏఐ కంపెనీలు భద్రతా చర్యలు తీసుకున్నాయని స్థానిక పత్రికలు పేర్కొన్నాయి. అయినప్పటికీ వ్యూహాత్మకంగా రూపొందించిన ప్రశ్నలు, సంభాషణలతో ఏఐ రక్షణ వ్యవస్థను ఛేదించవచ్చని జీఏఓ నిరూపించింది. తమ చాట్‌బాట్‌లు ప్రమాదకరమైన సమాచారాన్ని అందించే అవకాశం ఉందని ఆ చాట్‌బాట్‌లను తయారు చేసిన కంపెనీలు అంగీకరించాయి. అయితే జీఏఓ పరిశోధన అంశాలను అవి సవాలు చేశాయి.

ఈ వార్తలనూ చదవండి:

చెన్నైలో భారీగా హెరాయిన్ పట్టివేత.. రూ.710 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం..

నైలాన్ తాడుతో చిన్నారి చేతులు కట్టేసి కొట్టిన టీచర్.. తమిళనాడు స్కూల్లో ఘటన

Updated Date - Nov 20 , 2026 | 03:33 AM