Share News

నైలాన్ తాడుతో చిన్నారి చేతులు కట్టేసి కొట్టిన టీచర్.. తమిళనాడు స్కూల్లో ఘటన

ABN , Publish Date - Nov 19 , 2026 | 06:49 PM

మూడేళ్ల చిన్నారిని నైలాన్ తాడుతో చేతులు కట్టేసి టీచర్ దాడి చేసింది. తమిళనాడులో తిరువారూర్ జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూల్లో ఈ ఘటన జరిగింది.

నైలాన్ తాడుతో చిన్నారి చేతులు కట్టేసి కొట్టిన టీచర్.. తమిళనాడు స్కూల్లో ఘటన

ఇంటర్నెట్ డెస్క్: మూడేళ్ల చిన్నారిని నైలాన్ తాడుతో చేతులు కట్టేసి టీచర్ దాడి చేసింది. తమిళనాడులో తిరువారూర్ జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూల్లో ఈ ఘటన జరిగింది. బాధిత బాలుడు తిరుత్తరాయ్‌పూండిలోని సాయిరాం మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ప్రీ కేజీ చదువుతున్నాడు. బాలుడు మంగళవారం పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. అతని తల్లిదండ్రులు గోపీనాథ్, మహిమ బాలుడి శరీరంపై గాయాలను గమనించారు. ఏమైందని పిల్లవాడిని అడగా తన టీచర్, సహాయకురాలు తన చేతులు కట్టేసి కొట్టారని చెప్పాడు. తర్వాత అతని పేరెంట్స్ స్కూల్‌కు వెళ్లి సీసీటీవీ కెమెరాలు పరిశీలించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో పాఠశాల మేనేజ్‌మెంట్‌కు వారు ఫిర్యాదు చేశారు.


క్లాస్‌రూంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీని చెక్ చేయగా.. బాలుడి చేతులను టీచర్ ఒక నైలాన్ తాడుతో కట్టడం కనిపించింది. అలాగే ఆ పాఠశాలలో పనిచేసే సహాయకురాలు కూడా ఒక స్క్రీన్‌పై బాలుడిని నొక్కిపెట్టినట్లు కనిపించింది. ఆ ఫుటేజీని గోపీనాథ్ తన మొబైల్ ఫోన్‌లో రికార్డు చేసి తిరుత్తరాయ్‌పూండి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. టీచర్ భాగ్యలక్ష్మి (26), స్కూల్ అసిస్టెంట్ సెల్వి (55) ని ప్రశ్నిస్తున్నారు. కాగా.. పిల్లవాడి చేతులు కట్టేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి..

కాంగ్రెస్‌కు అఖిలేశ్ యాదవ్ షాకిచ్చారా.. కేవలం 24 సీట్లే ఇస్తామంటూ ఆఫర్..

జంతుబలులను నిషేధించాలంటూ పిటిషన్‌.. కొట్టివేసిన సుప్రీంకోర్టు

Updated Date - Nov 19 , 2026 | 06:49 PM